AP Ministers Vs Harish Rao : తగ్గేదేలే అంటున్న హరీష్ రావు.. ఏపీ మంత్రులపై మరోసారి సీరియస్ కామెంట్స్..

ABN, First Publish Date - 2023-04-17T20:36:00+05:30

ఏపీ మంత్రులు (AP Ministers) వర్సెస్ తెలంగాణ మంత్రి హరీష్ రావు (TS Minister Harish Rao) ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంపై..

AP Ministers Vs Harish Rao : తగ్గేదేలే అంటున్న హరీష్ రావు.. ఏపీ మంత్రులపై మరోసారి సీరియస్ కామెంట్స్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ మంత్రులు (AP Ministers) వర్సెస్ తెలంగాణ మంత్రి హరీష్ రావు (TS Minister Harish Rao) ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంపై ఈ మధ్య హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ మంత్రులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడారు. మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju) అయితే.. సీఎం కేసీఆర్‌ (CM KCR), మంత్రులు హరీష్, కేటీఆర్‌ల (Harish Rao, KTR) గురించి వ్యక్తిగతంగా కూడా కామెంట్స్ చేశారు. అంతేకాదు.. సీదిరి చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆయనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా మంత్రులు చేసిన కామెంట్స్‌తో దీంతో ఒక్కసారిగా ఏపీ వర్సెస్ తెలంగాణగా (AP Vs Telangana) పరిస్థితులు మారిపోయాయి. అయితే పాత కామెంట్స్ హీట్ తగ్గక మునుపే మరోసారి ఏపీ మంత్రులపై మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు హరీష్. అసలు తాను ఏమన్నానని అంతగా ఏపీ మంత్రులు ఎగిరెగిరిపడుతున్నారంటూ ఒకింత ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఏపీ మంత్రులకు పలు సలహాలు, సూచనలు కూడా చేశారు.

Harish-Rao-Final.jpg

నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే..!

సోమవారం నాడు సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా హరీశ్ రావు ఏపీ మంత్రులపై మరోసారి కామెంట్స్ చేశారు. నేను ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలే అని చెప్పాను. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి.. బాగుండాలని అన్నాను. మేం ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. కానీ ప్రజలను.. ఏపీని కించపరిచే విధంగా మాట్లాడానని కొందరు నాయకులు అనడం అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయి అని మాత్రమే చెప్పాను. తెలంగాణలో అన్ని బాగున్నాయి.. ఇక్కడే ఉండండి అని ఆ రోజు నేను చెప్పాను. ఏపీ అభివృద్ధి కోసం మాట్లాడానే తప్ప అక్కడి ప్రజలను తిట్టలేదు. నేను అడిగినదానికి సమాధానం చెప్పలేక కొందరు ఏపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status), పోలవరం (Polavaram), విశాఖ ఉక్కుపై (Visakha Ukku)మౌనమెందుకని ప్రశ్నించాను. నేను మాట్లాడినదానిలో ఏమైనా తప్పుందా?. ఏపీ నేతలకు చేతనైతే హోదా, విశాఖ ఉక్కుపై పోరాడండి.. అంతేకాని మాపై కాదు. విశాఖ ఉక్కు కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పోరాడటం లేదు. ఈ విషయం మాట్లాడితే మంత్రులకు అంత కోపం ఎందుకు..?అని మరోసారి ఏపీ మంత్రులపై హరీష్ కన్నెర్రజేశారు.

ఇప్పుడెందుకు మౌనం..!?

పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరం (Keleswaram) లాగా నీళ్లు అందించాలి. పోలవరం పనులు (Polavram Works) ఎందుకు కావడం లేదు..? నేను మాట్లాడిన మాటల్లో ఇందులో ఏమైనా తప్పుందా.?. అభివృద్ధి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం సహజమే. కర్ణాటకలో (Karnataka) 7 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. తెలంగాణలో బోరు బావుల వద్ద 24 గంటల కరెంట్ ఉంటుంది. తెలంగాణలో కరెంట్ (Power), నీళ్లు (Water), పెన్షన్ (Pensions) వస్తున్నాయి ఇక్కడే ఉండండి అని ఇక్కడే పనిచేస్తున్న ఏపీ కూలీలతో (AP Workers) నేను అన్నాను. ఇది తెలియకుండా కొంత మంది నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవద్దంటూ, విభజన జరిగాక ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించిన నాయకులు.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలిఅని ఏపీ మంత్రులను హరీష్ రావు డిమాండ్ చేశారు.

మొత్తానికి చూస్తే.. ఏపీ మంత్రుల విషయంలో హరీష్ రావు ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. హరీష్ కామెంట్స్‌కు ఇక ఏపీ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో.. ముఖ్యంగా సీదిరి ఏమంటారో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్‌ మూడాఫ్‌ అయ్యారా.. ఈ దెబ్బతో..!

******************************

Viveka Murder Case : ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తగ్గేదేలే అని తేల్చి చెప్పేసిన సీబీఐ.. హైకోర్టు కీలక ఆదేశాలు

******************************
MP Avinash CBI Enquiry : ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో మరో ట్విస్ట్.. ఎవరూ క్లారిటీ ఇవ్వరేం..!?

******************************

Updated Date - 2023-04-21T13:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising