CBN Arrest : 15 నిమిషాల ములాఖత్‌లో అచ్చెన్నకు చంద్రబాబు ఏం చెప్పారు..?
ABN, First Publish Date - 2023-09-25T18:26:25+05:30
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు అచ్చెన్న కూడా జైలులో బాబుతో భేటీ అయ్యారు...
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు అచ్చెన్న కూడా జైలులో బాబుతో భేటీ అయ్యారు. సుమారు 10 నుంచి 15 నిమిషాలపాటు జరిగిన ఈ ములాఖత్‌లో చంద్రబాబు-అచ్చెన్న మధ్య పలు విషయాలపై ఆసక్తికర సంభాషణ జరిగింది. భేటీ అనంతరం అసలేం జరిగిందనే విషయాలను మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడించారు.
ఏం మాట్లాడారు..?
‘స్కిల్ డెవలప్మెంట్ కేసులో కావాలనే చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును జైల్లో పెట్టారు. ఈ ప్రభుత్వం మొదటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియనియడం లేదు. మొత్తం రెండు రోజుల్లో 33 ప్రశ్నలు చంద్రబాబుకు వేశారు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సంబంధం లేని ప్రశ్నలు వేశారు. సీఐడీ అధికారులు చంద్రబాబుకు వేసిన 33 ప్రశ్నలకు రేపు (మంగళవారం) స్టడీ చేసి డీటెయిల్‌గా సమాధానం ఇస్తాం. రూ. 371 కోట్ల అవినీతి చేశారని చంద్రబాబును జైల్లో పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. చివరకు న్యాయమే గెలుస్తుంది’ అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
బాబు ఏం చెప్పారు..?
‘చంద్రబాబు జైల్లో ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా మమ్మల్ని పోరాటం చేయమని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది. చంద్రబాబు భద్రతపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. జైల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. నేను ధైర్యంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయమని చంద్రబాబు చెప్పారు. జనసేన కార్యకర్తలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేయమని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించాలని చెప్పారు. చంద్రబాబు భద్రతపై జైలు అధికారులతో మాట్లాడాం. చంద్రబాబు చెప్పిన సమాధానాలకు అధికారులే నీళ్లు నమిలారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వన్‌సైడ్‌గా గెలవబోతోంది. చంద్రబాబు సీఎం అవుతారని సర్వేల్లో తెలుస్తోంది. టీడీపీలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త చంద్రబాబులే’ అని అచ్చెన్న మీడియాకు వెల్లడించారు.
లోకేష్‌కు భయమా..?
‘ యువనేత నారా లోకేష్‌కు అరెస్ట్ భయం లేదు. లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర పరిణామాలపై నేషనల్ మీడియాకు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. లోకేష్‌కు అరెస్ట్ అంటే భయమేమీ లేదు. నన్ను కూడా అరెస్ట్ చేసినా భయమేమీ లేదు. నాకు కూడా కేసులు, అరెస్ట్‌లు కొత్తేమీ కాదు’ అని అచ్చెన్న చెప్పుకొచ్చారు. కాగా.. ఇవాళ చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం అయ్యారు. కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులను నిశితంగా బాబుకు వివరించారు. కాగా.. రిమాండ్ తర్వాత చంద్రబాబును మూడోసారి భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అచ్చెన్నతో ప్రత్యేకంగా 15 నిమిషాలపాటు బాబు సమావేశమై చర్చించారు.
ఇవి కూడా చదవండి
YSRTP : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన.. డెడ్‌లైన్..
CBN Skill Case : సీఐడీ విచారణలో చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!?
NCBN Remand : చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఈసారి ఎన్నిరోజులంటే..?
CBN CID Enquiry : రెండో రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?
Updated Date - 2023-09-25T18:30:38+05:30 IST