ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ChandraBabu: చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకే ఎందుకు?

ABN, First Publish Date - 2023-09-11T17:57:15+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, కడప, విశాఖ, రాజమహేంద్ర వరంలో కేంద్ర కారాగారాలు ఉన్నాయి. వీటిలో రాజమహేంద్రవరం జైలు పెద్దది. ఉమ్మడి ఏపీలో వీఐపీలను చంచల్‌గూడ, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాలకు పంపించేవారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, కడప, విశాఖ, రాజమహేంద్ర వరంలో కేంద్ర కారాగారాలు ఉన్నాయి. వీటిలో రాజమహేంద్రవరం జైలు పెద్దది. ఉమ్మడి ఏపీలో వీఐపీలను చంచల్‌గూడ, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాలకు పంపించేవారు. విభజిత ఏపీలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సామర్థ్యం, విస్తీర్ణం, భద్రతా పరంగా మిగతా వాటికంటే ఉన్నత స్థితిలో ఉండడంతో ఇక్కడకు తరలిస్తారు. 196 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలులో 40 ఎకరాల్లో వివిధ బ్లాకులు, బ్యారెక్‌లు ఉన్నాయి. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండు ఖైదీలు సుమారు 1800 మంది ఉంటారు. వీరిలో కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు. దీంతో చంద్రబాబుకు భద్రత కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.


నెలాఖరు వరకూ సెక్షన్‌ 30 అమలు

చంద్రబాబు రిమాండ్‌ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ జగదీశ్‌ తెలిపారు. దీంతో నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని,డీజే సిస్టమ్స్‌ ఉపయోగించరాదని చెప్పారు. భారీగా పోలీసు బలగాలు, పెట్రోలింగ్‌ వాహనాలను, బారీ కేడింగ్‌ను ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు ఇబ్బంది కలగ కుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

రిమాండ్‌ విధించిన చంద్రబాబును ఆదివారం అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. విజయవాడ నుంచి పెద్ద ఎత్తున కాన్వాయ్‌ మధ్య పోలీసులు ఆయనను రాజమండ్రికి తీసుకువెళ్లారు. అప్పటికే సెంట్రల్‌ జైలు రహదారిని పోలీసులు దిగ్బంధించారు. అటు లాలాచెరువు, ఇటు వై-జంక్షన్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ దారిలో ఎవరినీ అనుమతించలేదు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇదే దారిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉండడంతో రోగులకు నరకయాతన తప్పలేదు.

Updated Date - 2023-09-11T17:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising