CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.. ఇన్నాళ్లూ ఎందుకీ గోప్యత..!?
ABN, First Publish Date - 2023-10-26T14:31:35+05:30
అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై (Chandrababu Health) కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుకున్నదే అక్షరాలా నిజమైంది.! ఇన్నిరోజులూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు రోజువారీగా హెల్త్ బులెటిన్ (CBN Health Report) ఇచ్చినప్పటికీ అదంతా పచ్చి అబద్ధమేనని.. అభూత కల్పన అని తేలిపోయింది..
అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై (Chandrababu Health) కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుకున్నదే అక్షరాలా నిజమైంది.! ఇన్నిరోజులూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు రోజువారీగా హెల్త్ బులెటిన్ (CBN Health Report) ఇచ్చినప్పటికీ అదంతా పచ్చి అబద్ధమేనని.. అభూత కల్పన అని తేలిపోయింది. ప్రతిసారీ బాబు ఆరోగ్యంగానే ఉన్నారని.. అంతా బాగానే ఉందని చెప్పారే కానీ పైకి మాత్రమే అలా చెప్పారు కానీ.. వాస్తవానికి అసలు విషయం మాత్రం వేరు. చంద్రబాబు చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జైలులో పరీక్షించిన వైద్యు నిపుణులే చెప్పడం షాకింగ్ విషయం. బుధవారం నాడు ఐదుగురు ప్రభుత్వ వైద్యులు బుధవారం ఉదయం రాజమహేంద్రవరం జైల్లో (Rajahmundry Central Jail) చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి.. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వైద్య పరీక్షల నివేదికను జైలు అధికారులు నిన్న సాయంత్రం భువనేశ్వరికి (Nara Bhuvaneswari) పంపారు. ఈ నివేదికలో సంచలన విషయాలు ఉన్నాయి.
నివేదికలో ఏముంది..?
స్కిన్ అలర్జీతో కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు శరీరంపై దద్దుర్లు వ్యాపించి నొప్పి, ఇతరత్రా సమస్యలు వచ్చాయి. మందుల వాడకంతోపాటు చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు అప్ప ట్లో సిఫారసు చేశారు. కోర్టు ఆదేశంతో ఆయన గదిలో ఏసీ పెట్టారు. కానీ... దద్దుర్ల సమస్య తగ్గలేదని తాజా వైద్య నివేదికలో తెలిపారు. ‘‘విరోచనం వచ్చే ప్రాంతంలో నొప్పితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. వెన్ను కింది భాగంలో నొప్పిగా ఉందన్నారు. శరీరంపై ఇంకా దద్దుర్లున్నాయి. కూర్చున్నప్పు డు కూడా గాలి తగిలేందుకు వీలుగా ఉన్న కుర్చీ సమకూర్చాలి. ఆయన కూడా కూర్చునే పొజిషన్‌ను మార్చుకొంటూ ఉండాలి. సమస్య ఇంకా పెరగకుండా చల్లటి వాతావరణం కొనసాగించాలి’’ అని వైద్య నివేదికలో సూచించారు. చంద్రబాబు చెప్పిన, వైద్యులు గుర్తించిన అంశాలపై బయట ఉన్న వైద్య నిపుణులను సంప్రదించగా... ‘విరోచనం సాఫీగా కాకపోవడం, ఇబ్బంది, నడుం కింది భాగంలో నొప్పి ఉండటం వంటివి లోపల ఏదో సమస్య ఏర్పడుతోందని సూచిస్తున్నాయి. ప్రాక్టోస్కోపీ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే సమస్య తెలుస్తుంది. అలాగే వదిలేస్తే ఫిషర్‌లాంటి సమస్యకు దారితీసే ప్రమాదముంది’’ అని తెలిపారు. ఇక.. జైల్లో ఆయనను పరీక్షించిన వైద్యులు కొన్ని వైద్య పరీక్షలను సిఫారసు చేశారు. పూర్తి రక్త పరీక్ష, కిడ్నీ, లివర్ పరీక్ష లు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే, 2డి ఎకో వంటివి ఇందులో ఉన్నాయి. కోగ్యులేషన్ ప్రొఫైల్ అనే పరీక్షను కూడా వైద్యులు సిఫారసు చేశారు. కాగా, జైలులో చంద్రబాబుకు ఒక వైద్యుడు కంటి పరీక్ష చేశారు. ఆయన ఎడమ కంటికి గతంలో కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేశారని, ఇప్పుడు కుడి కంటికి కూడా అదే చేయాలని సిఫారసు చేశారు. అయితే... జైలు అధికారులు ఆ విషయాన్ని నివేదికలో పేర్కొన వద్దని ఒత్తిడి చేసినట్లు సమాచారం.
ఎందుకింత గోప్యత..?
చంద్రబాబు ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ‘ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. ఎలాంటి సమస్యలు లేవు’ అని రోజువారీగా బులెటిన్‌లో జైలు అధికారులు చెబుతుండటం గమనార్హం. బాబు ఆరోగ్యంపై ఎందుకింత గోప్యత పాటిస్తున్నారు..? అసలు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏం జరుగుతోంది..? ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి జైలు అధికారులకు వచ్చిన ఇబ్బందేంటి..? వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏంటి..? జైలు అధికారులకు ఎక్కడ్నుంచి ఆదేశాలు వస్తున్నాయి..? పదే పదే ఎందుకిలా చేస్తున్నారు..? అనే అనుమానాలు చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలకు వస్తున్న సందేహాలు. బాబుపై జగన్ సర్కార్‌కు ఎందుకింత కక్ష గట్టింది..? ఏమిటీ మొక్కుబడి హెల్త్ బులెటిన్..? అంటూ జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు.
హైకోర్టు ఏం తేలుస్తుందో..?
ఇదిలా ఉంటే.. హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైద్యులు ఇచ్చిన నివేదికలోని మిగతా అంశాలపై కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పిటిషన్‌లో వివరించారు. దీంతో పాటు.. చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ 3 నెలల క్రితం జరిగిందని.. ఇపుడు కుడి కంటికి కూడా ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. హైకోర్టు ఏం తేలుస్తుందనే దానిపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి ఆసక్తి నెలకొంది.
Updated Date - 2023-10-26T15:22:31+05:30 IST