CBN Health : చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై తీరు మార్చుకోని జగన్ సర్కార్.. ఏం జరుగుతోంది!
ABN, First Publish Date - 2023-10-25T22:51:25+05:30
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యంపై (CBN Health) జగన్ సర్కార్ (Jagan Govt) అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయ్యి ఇప్పటికి 47 రోజులు అవుతున్నా ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టలేదని.. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి...
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యంపై (CBN Health) జగన్ సర్కార్ (Jagan Govt) అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయ్యి ఇప్పటికి 47 రోజులు అవుతున్నా ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టలేదని.. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. చంద్రబాబు డీ హైడ్రోషన్‌కు గురికావడం, చర్మ సంబంధిత ఇబ్బందులు తలెత్తడం, బరువు తగ్గడం.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం తీరు మార్చుకోవట్లేదు. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు ఒకలా.. డాక్టర్‌లు మరోలా చెబుతుండటంతో జైలు లోపల ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.
పట్టించుకోరేం..?
ఈ మధ్య బాబు కంటి సమస్యలు రావడంతో వైద్యం చేయాలని ప్రభుత్వ వైద్యులు పదే పదే చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే.. బాబు వైద్యంపై ఇప్పటికే ఇచ్చిన నివేదిక మార్చి ఇవ్వమని డాక్టర్‌పై జైలు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఇప్పట్లో చంద్రబాబు కంటికి ఎటువంటి వైద్యం అక్కర్లేదని నివేదిక కూడా ఇచ్చేలా వైద్యులపై రాజమండ్రి జైలు ఉన్నతాధికారులు ఒత్తిడి.. హెచ్చరిస్తున్నట్లుగా తెలియవచ్చింది. జైలు అధికారుల తీరుపై టీడీపీ శ్రేణులు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు జైలులో ఏం జరుగుతోంది..? ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రభుత్వం ఎందుకిలా నాటకాలు ఆడుతోంది..? అంటూ జగన్ సర్కారు తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
ఇవాళ్టి బులెటిన్‌లో ఇలా..
కాగా.. చంద్రబాబుకు ఇన్ని ఆరోగ్య సమస్యలున్నప్పటికీ హెల్త్ బులెటిన్‌లో మాత్రం అంతా బాగానే ఉందని జైలు అధికారులు చెబుతుండటం గమనార్హం. పైగా.. బాబుకు డాక్టర్ల బృందం 9 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు చెబుతున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. అయితే.. గురువారం మధ్యాహ్నం లేదా ఎల్లుండి చంద్రబాబుతో కుటుంబ సభ్యులు లేదా టీడీపీ కీలక నేతలు ములాఖత్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ ములాఖత్‌తో చంద్రబాబు ఆరోగ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
Updated Date - 2023-10-25T22:55:23+05:30 IST