Accident : వైఎస్ విజయలక్ష్మికి తప్పిన పెను ప్రమాదం..!
ABN, First Publish Date - 2023-10-13T19:09:27+05:30
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి (YS Vijayalakshmi) పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లగా.. మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది...
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి (YS Vijayalakshmi) పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లగా.. మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని కార్లు (Vijayamma Car Accident) ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతిన్నది. అయితే విజయమ్మకు గానీ.. కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులోనే ఆమె ఒంగోలు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై అటు సీఎం జగన్ రెడ్డి.. ఇటు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల.. విజయమ్మ సెక్యూరిటీకి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయమ్మకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు.
రంగంలోకి విజయలక్ష్మి..!
ఇదిలా ఉంటే.. గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సాఆర్ సతీమణి విజయలక్ష్మి ఈ సారి తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వైఎస్ఆర్టీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తాను పాలేరుతో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. అయితే.. తన తల్లి విజయమ్మ, భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ను కూడా పోటీచేయించాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి ఉందని స్వయంగా షర్మిలనే చెప్పారు.
ఇప్పుడు కూతురికోసం!
కాగా.. వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రస్థానం ఇప్పటిదాకా ఏపీలోనే కొనసాగింది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పులివెందులకు ఉప ఎన్నిక రాగా.. కాంగ్రెస్ తరఫున ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమారుడు జగన్.. కాంగ్రెస్‌ను వీడి వైసీపీని పెట్టినప్పుడు.. విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పులివెందుల నుంచి ఆమె తిరిగి ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ చేయగా.. విజయలక్ష్మి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. తెలంగాణలో వైఎస్ఆర్ పాలన లక్ష్యంగా ఆమె కూతురు షర్మిల.. వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచీ విజయలక్ష్మి తెలంగాణలో షర్మిలకు అవసరమైన సహకారం అందిస్తూ వస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Big Breaking : ఫైబర్‌నెట్ కేసులో జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాక్.. వైసీపీలో టెన్షన్!
CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరిడెంట్ కీలక ప్రకటన.. ఎక్స్‌క్లూజివ్
CBN Arrest : రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అస్వస్థత.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే..?
Skill Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్‌కు భారీ ఊరట
Lokesh Delhi Tour : అమిత్ షాతో కీలక భేటీ తర్వాత.. లోకేష్ ఢిల్లీలో ఏం చేయబోతున్నారు.. రేపు సంచలనమేనా..!?
Updated Date - 2023-10-13T19:12:43+05:30 IST