Avinash Vs CBI Live Update : అవినాశ్ చుట్టూ హైడ్రామా.. కర్నూలుకు వైఎస్ విజయలక్ష్మి ..
ABN, First Publish Date - 2023-05-22T11:08:38+05:30
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
07:13 PM: సుప్రీంకోర్టుకు అవినాశ్ రెడ్డి..
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్‌కు సీబీఐ (CBI) సన్నద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్ట్ వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme court) ఆయన పిటిషన్ వేశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారంపాటు సీబీఐ విచారణకు హాజరుకాకుండా మినహాయింపునివ్వాలని ఆయన అభ్యర్థించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌ను వినేవరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
05:01 PM: విశ్వభారతి హాస్పిటల్‌కు వైఎస్ విజయమ్మ
ఏపీ సీఎం జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి కర్నూలు వెళ్లారు. అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆమె పరామర్శించారు. అవినాశ్‌ను అడిగి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. అవినాశ్ చుట్టూ కర్నూలులో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆమె కర్నూలు వెళ్లడం గమనార్హం.
03:48 PM: ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ తథ్యం: ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడారు. అవినాశ్ వ్యవహారంలో సీబీఐ (CBI) అధికారులు సీరియస్‌గా ఉన్నారని, సోమవారం అరెస్టు చేయడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అవినాష్‌కు గుండెపోటు వచ్చిందని చెప్పి.. ఆపరేషన్ కూడా చేస్తున్నామని 10 మంది డాక్టర్లు యాక్షన్ చేస్తే తప్ప.. అరెస్టు ఆగదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
03:33 PM: ఎస్పీ బంగ్లా నుంచి బయటకొచ్చిన సీబీఐ అధికారుల బృందం
దాదాపు 8 గంటలపాటు కర్నూలు ఎస్పీతో భేటీ అయిన సీబీఐ అధికారులు
అవినాశ్ రెడ్డి అరెస్టుకు సహకరించని కర్నూలు పోలీసులు
కర్నూలు పోలీసుల చేతులు ఎత్తేశారంటూ సీబీఐ ఉన్నతాధికారులకు సమాచారం అందించిన అధికారులు
ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఆర్పీఎఫ్ బలగాలు
మరికొద్ది సేపట్లో కర్నూలు చేరుకునే అవకాశం
03:02 PM: మరికొద్దిసేపట్లో సీబీఐ కీలక నిర్ణయం
కర్నూలులో సీఆర్‌పీఎఫ్ బలగాల కోసం ఎదురుచూస్తున్న సీబీఐ అధికారులు
సీఆర్‌పీఎఫ్ ఐజీతో చర్చించిన అధికారులు
అధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ జోన్ నుంచి బయలుదేరిన బలగాలు
మరికొద్దిసేపట్లో అవినాశ్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకోనున్న సీబీఐ
కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌కు బయలుదేరిన సీఆర్పీఎఫ్ బెటాలియన్. మరో 2 గంటల్లో చేరుకోవచ్చని అంచనా.
02:00 pm : మరోసారి ఎస్పీని కలిసి సీబీఐ అధికారులు
ఉదయం నుంచి రెండోసారి ఎస్పీని కలిసిన సీబీఐ అధికారులు
అవినాష్ అరెస్ట్‌కు సహకరించాలని కోరిన సీబీఐ
సీబీఐ విజ్ఞప్తిపై ఇంతవరకూ స్పష్టత ఇవ్వని ఎస్పీ కృష్ణకాంత్
డీజీపీ ఆదేశాలు ఇస్తేనే నిర్ణయం తీసుకుంటామని సీబీఐకి ఎస్పీ చెప్పినట్లు సమాచారం.
01:50 pm : కర్నూలుకు సీఆర్పీఎఫ్ బెటాలియన్.. టెన్షన్.. టెన్షన్
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి బయలుదేరిన సీఆర్పీఎఫ్ బెటాలియన్
హైదరాబాద్ జోన్ నుంచి అధికారుల ఆదేశాలతో బయల్దేరిన సీఆర్పీఎఫ్
మరో 4 గంటల్లో కర్నూలు చేరుకోనున్న బెటాలియన్
సీఆర్పీఎఫ్ ఐజీతో చర్చిన సీబీఐ అధికారులు
ఆస్పత్రి వెనక వైపు బెటాలియన్ కోసం వేచి చూస్తున్న సీబీఐ టీమ్
కేంద్రబలగాల సాయంతో అవినాష్‌ను అరెస్ట్ చేయాలని భావిస్తున్న సీబీఐ
బెటాలియన్ బయల్దేరడంతో వైసీపీ, అవినాష్ అభిమానుల్లో మొదలైన టెన్షన్
అరెస్ట్‌ను తప్పించేందుకు లాబీయింగ్ కోసం పీఎంవోలో చర్చలు జరుపుతున్న బడా నేతలు
అవినాష్ తల్లికి మొదటి నుంచి గుండె సంబంధిత సమస్య ఉందంటున్న సీబీఐ
గుండెలో బ్లాక్స్ ఉన్నా మెడికేషన్ పైనే ఉన్న అవినాష్ తల్లి
సీబీఐ సమయం వృధా చేయాలనే ఉద్దేశ్యంతోనే స్టంట్ అంశం తెరమీదకు తెచ్చినట్లు గుర్తించిన సీబీఐ
01:45pm : ఏమిటీ వీఐపీ ట్రీట్మెంట్..?
నిందితుడిని వీఐపీగా ట్రీట్ చేస్తే ఎలా?: ABNతో లాయర్ శ్రవణ్ కుమార్
అవినాశ్ అరెస్ట్ విషయంలో పొలిటికల్ డ్రామా నడుస్తోంది
పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది
50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి
తల్లికి బాగలేదు, తమ్ముడికి బాగలేదు అంటే సరికాదు
సామాన్యులతో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా?
సునీత తండ్రి ప్రాణాలు... మీ తల్లి ప్రాణాలు ఒకటి కాదా?
అనుచరులను పెట్టి మీడియాపై దాడులు చేయడం సరికాదు
సీబీఐ అరెస్టు అనేది చాలా సాధారణమైన విషయం: ABNతో శ్రవణ్ కుమార్
01:41pm : సీబీఐకి అప్పగించండి..!
ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్ర: మాజీ మంత్రి జవహర్
పోలీసులు అవినాష్ రెడ్డిని సీబీఐకి అప్పగించాలి
సీబీఐ విచారణ నాలుగేళ్లుగా కొనసాగటం చరిత్రలో మొదటిసారి
ప్రాధాన్యతగల కేసులే ఈ విధంగా ఉంటే.. సామాన్య కేసుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు
అరెస్టు ఆపే శక్తి జగన్‌కు మాత్రమే ఉంది..
కేంద్ర బలగాలతో నిందితులను అదుపులోకి తీసుకోవాలి
సీబీఐకి పోలీసులు ఎందుకు సహకరించడం లేదు : జవహర్
01:29pm : నిరసన
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి విలేఖరులపై ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల దాడిని నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ సంఘాల నిరసన
దాడి చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న జర్నలిస్టులు
12:45 pm : సీబీఐకి మరోసారి లేఖ..
సీబీఐకి మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని తెలిపిన అవినాష్ రెడ్డి
సుప్రీంలో తన పిటిషన్‌పై రేపు విచారణ ఉందని పేర్కొన్న అవినాష్ రెడ్డి
తన తల్లి అనారోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంను కోరిన అవినాష్
27 తరువాత సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని కోర్టుకు తెలిపిన అవినాష్ రెడ్డి
సుప్రీం కోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్నందున..
తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి
సీబీఐ నిర్ణయంపై వైసీపీలో టెన్షన్.. టెన్షన్
12:23pm : అన్నీ అనుమానాలే..!
SPని సీబీఐ అధికారులు బతిమిలాడటం ఏమిటి?: టీడీపీ నేత పట్టాభి
సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలున్నాయి: ABNతో పట్టాభి
సీబీఐ అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?: ABNతో పట్టాభి
గతంలో నాకు స్కానింగ్ తీయకుండా ఆల్ ఈజ్ వెల్ అని రాసిచ్చేశారు
నాకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 10రోజులు చికిత్స చేశారు: ABNతో పట్టాభి
హైదరాబాద్‌లో ఎన్నో ఆస్పత్రులుంటే... కర్నూలులో ఎందుకు ఆగారు
వైద్యుల హెల్త్ బులెటిన్ నమ్మశక్యంగా లేదు: ABNతో టీడీపీ నేత పట్టాభిరామ్
11:25 am : ఊహించని షాక్..
అవినాశ్‌కు ఎదురుదెబ్బ
ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అవినాశ్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి తొలగిన అడ్డంకి
బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించిన వెకేషన్ బెంచ్
మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామన్న.. జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం
రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని సూచించిన ధర్మాసనం
కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూ ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు: (Day 1 to Till Now)
వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి జనవరి 23, 2023న తొలిసారి సీబీఐ నోటీసులు
అవినాశ్ రెడ్డికి తొలిసారి నోటీసులు పంపిన అదే రోజున అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించిన సీబీఐ అధికారులు
జనవరి 28న తొలిసారి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
జనవరి 28న దాదాపు ఐదు గంటల పాటు అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ
ఫిబ్రవరి 24న విచారణకు హాజరు కావాలని రెండోసారి అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు
రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
మార్చి 10న మూడోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
విచారణకు హాజరయ్యే లోపు ట్విస్ట్ ఇచ్చిన కడప ఎంపీ..
సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అవినాశ్ రెడ్డి
అవినాశ్‌పై మార్చి 25 వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మార్చి 14న నాలుగోసారి విచారణకు రావాలని అవినాశ్‌కు సీబీఐ నోటీసులు
పార్లమెంట్ సమావేశాలను సాకుగా చూపి విచారణకు డుమ్మా కొట్టేందుకు అవినాశ్ యత్నాలు
పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున విచారణ నుంచి మినహాయింపు కావాలని హైకోర్టులో అవినాశ్ అభ్యర్థన
విచారణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన న్యాయస్థానం
పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ
అవినాశ్ రెడ్డి లేఖపై స్పందించని సీబీఐ
దీంతో.. ఎట్టకేలకు సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
నాలుగున్నర గంటల పాటు హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులో విచారణ
వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న కీలక పరిణామం
ఏప్రిల్ 16న అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
ఏప్రిల్ 19న ఐదోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
ఐదు గంటల పాటు అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు
మే 16న విచారణకు హాజరుకావాలని ఆరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు
160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ
మే 16 వరకూ 20 రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసు
అవినాశ్‌కు సీబీఐ నోటీసులతో మరోమారు వివేకా హత్య కేసుపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చ
మే 16న విచారణకు డుమ్మా కొట్టిన అవినాశ్ రెడ్డి
4 రోజులు గడువివ్వాలని సీబీఐకి లేఖ
పులివెందులలోని అవినాశ్ ఇంటికి సీబీఐ
ఎవరూ లేకపోవడంతో భాస్కర్ రెడ్డి డ్రైవరుకు నోటీసులు అందజేత
మే 19న విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు
మే 19న కూడా సీబీఐ విచారణకు గైర్హాజరైన అవినాశ్ రెడ్డి
అరెస్ట్ తప్పదని తేలిపోవడంతో సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ విశ్వ ప్రయత్నాలు
తల్లికి అస్వస్థతతో హుటాహుటిన ప్రయాణం
విచారణకు అవినాశ్ రాలేరని సీబీఐకి లాయర్ల సమాచారం
మాసబ్ ట్యాంక్ వద్ద మారిన కాన్వాయ్ రూట్
కొద్దిసేపు కాన్వాయ్‌ను వెంబడించిన సీబీఐ
పులివెందులలో ప్రార్థన చేస్తూ సొమ్మసిల్లిన అవినాశ్ తల్లి
గుండెపోటు అనుమానం.. అంబులెన్స్‌లో తరలింపు
గుత్తి వద్ద అనుచరులతో అవినాశ్ మాటామంతి
తాడిపత్రి వద్ద అంబులెన్స్‌లో తల్లికి పరామర్శ
కర్నూలులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
ఏబీఎన్‌పై దాడి..
ఏబీఎన్‌పై దాడి.. హైదరాబాద్ నడిబొడ్డున వైసీపీ శ్రేణుల రౌడీయిజం
అవినాశ్‌పై కవరేజీ ఆపాలని బెదిరింపులు
కెమెరా లాక్కొని దాంతోనే రిపోర్టర్‌పై దాడి
కెమెరామన్‌కు, డ్రైవర్‌కూ గాయాలు
ఏబీఎన్ వాహనం అద్దాలు ధ్వంసం
దాడిలో పాల్గొన్న అవినాశ్ అనుచరులు
ఏబీఎన్‌పై దాడిని ఖండించిన తెలంగాణ గవర్నర్, పార్టీలు, ప్రజా సంఘాలు
మరోసారి నోటీసులు
అవినాశ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు
మే 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసిన సీబీఐ
కర్నూలు ఆస్పత్రిలో ఎంపీ తల్లి
యాంజియోగ్రామ్ పరీక్షలు
రెండు గుండె నరాల్లో బ్లాకులు
ఆస్పత్రిలోనే ఉన్న వైసీపీ ఎంపీ
సీబీఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అవినాశ్
మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు
10 రోజులు సమయం ఇవ్వండి
సీబీఐకి అవినాశ్ రెడ్డి మరోసారి లేఖ
కర్నూలులో లక్ష్మమ్మకు కొనసాగుతున్న చికిత్స
నాలుగో ఫ్లోర్‌లో తల్లి.. ఐదో ఫ్లోర్‌లో కొడుకు
మూడో ఫ్లోర్‌లోనే సందర్శకుల సెల్‌ఫోన్లు
టెన్షన్.. టెన్షన్..
కర్నూలు: విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత
విశ్వభారతి ఆస్పత్రి దగ్గర విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణుల బైఠాయింపు
విశ్వభారతి ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మొహరింపు
వైసీపీ శ్రేణులను వెనక్కి పంపుతున్న పోలీసులు
ఆస్పత్రి ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
కర్నూలు: అర్ధరాత్రి విశ్వభారతి ఆస్పత్రి దగ్గర హైటెన్షన్
ఆస్పత్రి దగ్గర ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుల వీరంగం
మీడియా ప్రతినిధులపై అవినాశ్‌రెడ్డి అనుచరుల దాడి
వీడియా ప్రతినిధులతో వాగ్వాదం, దాడి
పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలు, కెమెరాలు ధ్వంసం
ఆస్పత్రి దగ్గరకు వస్తే చంపేస్తామంటూ అనుచరుల బెదిరింపులు
కర్నూలులో పరిస్థితిపై సీబీఐ ఉన్నతాధికారుల ఆరా
ఎప్పటికప్పుడు ఆరా..
ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సీబీఐ
కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్‌కు సమాచారం అందిస్తున్న కర్నూలు వెళ్లిన అధికారులు
కర్నూలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు
ఎస్పీ ఆఫీస్, ఆస్పత్రి దగ్గర మరికొంత మంది సీబీఐ అధికారులు
కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చిన సీబీఐ ఎస్పీ
విశ్వభారతి ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
వైసీపీ శ్రేణులను వెనక్కి పంపుతున్న పోలీసులు
కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వకంగా సీబీఐ ఎస్పీ సమాచారం
వరుసగా మూడు సార్లు విచారణకు హాజరుకాని అవినాశ్‌రెడ్డి
అవినాశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందన్న సీబీఐ
కర్నూలు చేరుకున్న కడప, హైదరాబాద్ సీబీఐ బృందాలు
కర్నూలు ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు
అవినాశ్‌ను లొంగిపోవాలని చెప్పాలని కోరిన సీబీఐ
శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు
కడప నుంచి కర్నూలుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరులు
పులివెందుల నుంచి కర్నూలుకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు
అవినాశ్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ శ్రేణుల ఆందోళనలు
హెల్త్ బులెటిన్..
కర్నూలు: అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల
శ్రీలక్ష్మి మరికొన్ని రోజులు ICUలోనే ఉండాలి: వైద్యులు
బీపీ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు, అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంది
శ్రీలక్ష్మి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు: విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు
క్రిటికల్ కేర్ యూనిట్‌లో శ్రీలక్ష్మికి చికిత్స అందిస్తున్నాం: వైద్యులు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్..
ఢిల్లీ: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి
ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో అవినాశ్‌రెడ్డి పిటిషన్
వెకేషన్ బెంచ్ ముందు మొన్షన్ చేయనున్న అవినాశ్‌రెడ్డి
జడ్జిలు జేకే మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు మెన్షన్ చేసిన అవినాశ్ న్యాయవాది
వెకేషన్ బెంచ్ ముందు బెయిల్ పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం
పిటిషన్ తన ముందుకు విచారణకు రావట్లేదన్న ధర్మాసనం
మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచన
కోర్టు నెంబర్.3 లోని బెంచ్‌కి వెళ్లిన అవినాష్ లాయర్లు
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని (Kadapa MP Avinash Reddy ) ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌లో (ViswaBharati Hospital) చికిత్స పొందుతున్న తల్లి శ్రీలక్ష్మి దగ్గరే అవినాష్ ఉన్నారు. సోమవారం విచారణకు రాలేనని లేఖ రాయడంతో.. ఇవాళ తెల్లవారుజామునే ఆస్పత్రి దగ్గరికి సీబీఐ బృందాలు చేరుకున్నాయి. దీంతో అవినాష్‌ను ఇవాళ అరెస్ట్ చేస్తారా..? లేకుంటే ఆస్పత్రిలోనే విచారిస్తారా..? ఇవన్నీ కాకుండా మరోసారి నోటీసులు ఇచ్చి సీబీఐ సైలెంట్ అవుతుందా అనేది తెలియని పరిస్థితి. అయితే.. ఓవైపు ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించగా.. పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు, అవినాష్ అనుచరులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీలో టెన్షన్ మొదలైంది.
Updated Date - 2023-05-22T19:20:25+05:30 IST