YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!
ABN, First Publish Date - 2023-09-13T14:14:03+05:30
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు (TDP Chief Chandrababu) త్వరలోనే భారీ ఊరట లభించనుందా..? బాబు తరఫున లాయర్లు, టీడీపీ లీగల్ టీమ్ (TDP Leagal Team) వ్యూహాత్మకంగా అడుగులేస్తోందా..? అంటే రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు (TDP Chief Chandrababu) త్వరలోనే భారీ ఊరట లభించనుందా..? బాబు తరఫున లాయర్లు, టీడీపీ లీగల్ టీమ్ (TDP Leagal Team) వ్యూహాత్మకంగా అడుగులేస్తోందా..? అంటే రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ ఏమిటా భారీ ఊరట..? బాబు తరఫు లాయర్లు ఏం చేయబోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో చూద్దాం..
ఇదీ అసలు కథ..
2019 ఎన్నికల్లో కుయుక్తులు పన్ని గెలిచిన వైసీపీకి (YSRCP) భారీగా గ్రాఫ్ పడిపోయిందన్న విషయం తెలిసిందే. దీంతో 2024 ఎన్నికల్లో (2024 Elections) గడ్డుకాలమేనని భావించి.. ఊహించని రీతిలో గ్రాఫ్ పెంచుకున్న టీడీపీని (Telugudesam) అణగదొక్కడానికి, ఎన్నికల ముందు చంద్రబాబును తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో ఉన్న పాత కేసులు, అసలు బాబుకు ఎలాంటి సంబంధం, ఆయన పాత్రలేని వాటిని బయటికి తీస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఏ మాత్రం లేనప్పటికీ.. ఆయన్ను ఇబ్బంది పెట్టడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్న వైసీపీ సర్కార్ కనీసం ముందస్తు నోటీసులు గానీ.. కేసు ఏంటనేది చెప్పకుండా.. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేకుండానే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. పోనీ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారా అంటే.. అదీ లేదు. నంద్యాల నుంచి రోడ్డు మార్గాన గంటల తరబడి తీసుకెళ్లడం.. విచారణ పేరుతో నిద్రాహారాలు లేకుండా చేయడం.. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు అలా కోర్టుకు తీసుకెళ్లడం.. ఇలా ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉన్నారు. అయితే ఆయనకు భద్రత సరిగ్గా లేదని.. హౌస్ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరినా ఇవ్వలేదు. దీంతో క్వాష్ పిటిషన్‌తో హైకోర్టును చంద్రబాబు తరఫు లాయర్లు ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. కస్టడీకి తీసుకోవద్దని.. 18వ తారీఖు వరకు ఆయన జోలికి వెళ్లొద్దని.. 19న దీనిపై విచారిస్తామని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో బాబుకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పుకోవచ్చు.
వైసీపీ కుట్ర ఇదీ..
ఇప్పుడున్న ‘స్కిల్’ కేసు పసలేనిదని.. అక్రమ కేసని.. ఇది నిలబడదని పసిగట్టిన వైసీపీ.. చంద్రబాబును మరిన్ని కేసుల్లో ఇరికించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకుగాను మొత్తం ఐదారు కేసులను దర్యాప్తు సంస్థలతో తెరపైకి తెచ్చింది. ఈ విషయాలన్నీ పసిగట్టిన టీడీపీ లీగల్ టీమ్, చంద్రబాబు తరఫు లాయర్లు వ్యూహాత్మకంగా ముందడుగులేస్తున్నారు. ఇవన్నీ బాబు తరఫున ఉన్న సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రాకు వివరించగా.. ‘లా’తో కొట్టాలని పక్కాగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేటప్పుడు.. సుప్రీంకోర్టులోని పలు కేసులను ఉదహరించడం, సాంకేతికంగా ఉన్న ప్రశ్నలను లేవనెత్తడంతో.. అటు సీఐడీ తరఫు లాయర్లు దద్దరిల్లిపోయిన పరిస్థితి. దీంతో ఇక ‘తగ్గేదేలే’ అని.. పూర్తిగా రంగంలోకి దిగడానికి సిద్ధార్థ ఫిక్సయ్యారట. ఏపీలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా..? చంద్రబాబు గురించి ఆలోచించి లూథ్రా ఒకింత ఆవేదనకు లోనయ్యారట. దీంతో చంద్రబాబుపై ఎన్నికేసులు బనాయించినా సరే.. కడిగిన ముత్యంలా ఆయన్ను బయటికి తెస్తారని లూథ్రాపై టీడీపీ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి. అన్ని కేసుల్లోనూ బాబు రిలీఫ్ దొరుకుతుందని క్యాడర్ గట్టి నమ్మకంతో ఉంది.
ఇంతకీ కేసులు ఏంటి..?
వైసీపీ ఇరికించాలని ప్లాన్ చేస్తున్న కేసులు ఏంటి..? బుధవారం నాడు కోర్టులో ఏం జరిగింది..? బాబు తరఫున ఏమేం పిటిషన్లు వేశారు..? హైకోర్టు ఏం విచారించింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
01. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati IRR Case)
02. అంగళ్లు అల్లర్ల కేసు (Angallu Rioting Case)
03. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ (Bail Petition)
04. క్వాష్ పిటిషన్ (Quash Petition)
05. పోలీస్ కస్టడీ పిటిషన్ (Police Custody)
ఈ కేసుల విషయంలో.. ఆయన తరఫు లాయర్లు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటి వరకూ బాబుపై ఎన్నికేసులు నమోదయ్యాయో వాటన్నింటిపైనా బెయిల్ పిటిషన్లు వేశారు లాయర్లు. ఒక్క బుధవారం నాడే బాబుకు సంబంధించి పలు పిటిషన్లపై విచారణ జరిగింది.ఈ 5 పిటిషన్లపైన చంద్రబాబుతో సంతకాలు చేయించుకొని టీడీపీ లీగల్ టీమ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఐదింటిలో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అక్రమకేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటిషన్లపై మాత్రమే విచారణ జరిగింది. ఇప్పటికే హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా.. సీఐడీ కస్టడీ (CID Custody) పిటిషన్‌పైనా విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
- ఇక రింగ్ రోడ్డు కేసులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఇందులో ఎలాంటి ఆధారాల్లేవని, అసలు భూసేకరణే జరగలేదని బాబు తరఫున లాయర్లు చెబుతుండగా.. కంతేరు, కాజాలో లింగమనేని ఫ్యామిలీకి 355 ఎకరాలు భూమి చంద్రబాబు హయాంలో కేటయించడం జరిగిందని సీఐడీ చెబుతోంది. అంతేకాదు.. రూ. 2,130 కోట్లకు పెరిగేలా బాబు కుట్ర పన్నారని సీఐడీ ఆరోపిస్తోంది.
- ఇక స్కిల్ అక్రమకేసులో ముందస్తు బెయిల్‌పై కూడా విచారణ వాయిదా పడింది. ఈ మూడు కేసులపై విచారణ 19 తారీఖుకు వాయిదా పడ్డాయి. మరో రెండు కేసుల్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ఇవాళే జరిగే అవకాశముంది.
- టీడీపీ నేతల హౌస్ అరెస్టులపై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తోందని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో సీఎస్, డీజీపీ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులిచ్చింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువు కోరింది. తదుపరి విచారణ రెండువారాలకు వాయిదా పడింది. వ్యవహారం నోటీసులిచ్చేదాకా వెళ్లిందంటే ప్రభుత్వానికి ఒకరకంగా షాకే అని చెప్పుకోవాలి.
మొత్తానికి చూస్తే.. వైసీపీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా సరే ధైర్యంగా, వ్యూహాత్మకంగా, ‘లా’తో కొట్టాలని లూథ్రా, టీడీపీ లీగల్ టీమ్ ఉంది. ఇప్పటికైతే కస్టడీ లేకపోవడంతో బాబుకు బిగ్ రిలీఫే. ఇక 19 తారీఖు విచారణ ఎలా ఉంటుందనే దానిపై మాత్రం సస్పెన్స్, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. అయితే.. అంతా మంచే జరగాలని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పూజలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మున్ముందు ఇంకా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో..? దానిపై వైసీపీ, టీడీపీ ఎలా ముందుకెళ్తాయో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు
Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ
Updated Date - 2023-09-13T14:16:02+05:30 IST