ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deepika YSRCP: ఎవరీ దీపిక.. సీఎం సమీక్షకు ఆమెకు ఆహ్వానం ఎందుకు అందిందంటే..

ABN, First Publish Date - 2023-06-22T16:51:55+05:30

సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిల సమీక్షకు హిందూపురం నుంచి ఇన్‌చార్జి ఇక్బాల్‌ను కాదని దీపికకు పిలుపు రావడంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీపికా.. మీటింగ్‌కు రామ్మా..!

సీఎం సమీక్షకు ఆమెకు ఆహ్వానం

పురం వైసీపీ ఇన్‌చార్జి ఇక్బాల్‌కు సెగ

మౌనంగా గమనిస్తున్న మరో రెండు వర్గాలు

హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని (Hindupuram) అధికార వైసీపీలో ఇన్‌చార్జి కాక రేగుతోంది. ప్రస్తుతం ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ను (Hindupuram Iqbal) వైసీపీ అధినాయకత్వం ఘోరంగా అవమానించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌చార్జిల సమీక్షకు హిందూపురం నుంచి ఇన్‌చార్జి ఇక్బాల్‌ను కాదని దీపికకు పిలుపు రావడంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. సమీక్షకు దీపిక హాజరు కావడంతో అధికార పార్టీలో కలకలం రేపింది. తాను ముఖ్యమంత్రి జగన్‌ పంపిన మనిషినని నాలుగేళ్లుగా ఎమ్మెల్సీ, మహమ్మద్‌ ఇక్బాల్‌ చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సమీక్షకు దీపిక హాజరుకావడంతో ఆయన రగిలిపోతున్నట్లు సమాచారం.

ఇన్‌చార్జిగా ఉన్నా.. మరొకరికి పిలుపు..

సాధారణంగా నియోజకవర్గ ఇన్‌చార్జినే పార్టీ సమీక్షకు పిలుస్తారు. మరొకరిని పిలవరు. ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం నిర్వహించిన సమీక్షకు నియోజవకర్గ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హిందూపురం నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి ఇక్బాల్‌తోపాటు వైసీపీ నాయకురాలు దీపికకు పిలుపు వచ్చింది. దీంతో ఆమె హాజరు కావడంతోపాటు ముందు వరుసలో, మంత్రుల జతలో కూర్చున్నారు.

రగిలిపోతున్న ఎమ్మెల్సీ వర్గం

నాలుగేళ్లుగా అసమ్మతి వర్గాలున్నా, ఎమ్మెల్సీ వర్గం పనిచేస్తూ వచ్చిందని, ఉన్నట్టుండి ఎమ్మెల్సీని కాదని మరొకరికి ఎలా అవకాశం ఇస్తారని ఇక్బాల్‌ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ వర్గీయులు ఆయనకు మద్దతుగా ఇటీవల నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. మైనార్టీలు రోడ్డెక్కారు. ఇక్బాల్‌ను కాదని మరొకరికి అవకాశం ఇస్తే వైసీపీని కచ్చితంగా ఓడిస్తామని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించినా, వైసీపీ అధినాయకత్వం వెనక్కు తగ్గలేదని సమాచారం. దీపిక కూడా సమావేశానికి హాజరైనట్లు బుధవారం సోషల్‌ మీడియాలో ఫొటోలు రావడంతో ఎమ్మెల్సీ వర్గం రగిలిపోతోంది. కష్టపడిన వారిని కాదని ఎవరికో అవకాశం ఇస్తే, పార్టీకి చేదు అనుభవం మరోసారి రుచి చూపిస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.

మరో రెండు వర్గాలు మౌనం

నాలుగేళ్లుగా ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఇక్కడి నుంచి సాగనంపాలని పోరాటాలు చేసిన రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ వర్గంతోపాటు చౌళూరు రామక్రిష్ణారెడ్డి సోదరి మధుమతి వర్గీయులు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. వీరి మౌనం వెనుక మతలబు తెలియాల్సి ఉంది. కష్టపడిన వారికే అవకాశం కల్పించాలని ఇన్ని రోజులు ఉద్యమాలు చేసిన వారు.. ఇప్పుడు మౌనం వహించడం ప్రశ్నార్థకంగా మారింది. తమను కాదని వేరొకరికి ఇస్తే పరిణామాలు మరోలా ఉంటాయని ఆయావర్గాల ముఖ్య నాయకులు.. తమ అనుచరుల వద్ద చెప్పుకున్నట్లు సమాచారం.

చక్రం తిప్పిన పెద్దిరెడ్డి?

ముఖ్యమంత్రి తనను కాదని వేరొకరికి బాధ్యతలు అప్పగించే ప్రసక్తే ఉండదని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ తన వర్గీయుల వద్ద తరచూ చెప్పుకుంటున్నట్లు తెలిసింది. 2024లో తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని ప్రకటించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాను ఏదైనా ముఖ్యమంత్రితోనే చెప్పుకుంటానని తరచూ ఆయన అంటుండేవారట. ఇదే విషయాన్ని పార్టీలో ఇతర పెద్దల వద్దా అనేవారట. దీంతో ఎమ్మెల్సీపై పార్టీలోని ఇద్దరు పెద్దలు గుర్రుగా ఉండేవారని ఎమ్మెల్సీ వర్గీయులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ కో ఆర్డినేటర్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొంతకాలంగా ఎమ్మెల్సీపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆయన వర్గీయుడిగా ఉన్న పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ద్వారా ఎమ్మెల్సీకి చెక్‌పెట్టి, దీపికను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీకి చెక్‌ పెట్టేందుకు ఓ పెద్దాయన కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ వర్గీయులు వాపోతున్నారు. ఏది ఏమైనా సీఎం సమీక్షకు దీపిక హాజరు కావడంతో పురం వైసీపీలో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోనన్న ఉత్కంఠకు తెరలేచింది. రేపో.. మాపో.. నియోజకవర్గ ఇన్‌చార్జిగా దీపికను ప్రకటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే సమీక్షకు ఆహ్వానించారని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు.

నాలుగేళ్లు చక్రం తిప్పిన ఇక్బాల్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ను 2019 ఎన్నికలకు కొన్నిరోజులు ముందు బీ-ఫారం ఇచ్చి హిందూపురానికి పంపింది వైసీపీ అధిష్టానం. ఆయన వచ్చిన మొదటిరోజు నుంచే అసమ్మతి మొదలైంది. ఆయన ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి.. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ స్థానిక నాయకులు ఆయన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటూ.. లోకల్‌, నాన్‌లోకల్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసమ్మతి నాయకులు నాలుగేళ్లుగా ఇక్బాల్‌కు వ్యతిరేకంగా పలు పోరాటాలు చేశారు. రోడ్డెక్కి ధర్నాలు చేశారు. అయినా ఇక్బాల్‌ను ఆపలేకపోయారు.

గత ఏడాది అక్టోబరులో వైసీపీ హిందూపురం నియోజకవర్గ మొదటి సమన్వయకర్త చౌళూరు రామక్రిష్ణారెడ్డి హత్యతో సీన్‌ మొత్తం మారిపోయింది. హత్యలో ఎమ్మెల్సీ వర్గీయుల హస్తం ఉందని రామక్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో రామక్రిష్ణారెడ్డి దారుణ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అప్పుడే ఎమ్మెల్సీని పంపించేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ వెంటనే ఎమ్మెల్సీని పంపితే అధికార పార్టీకి అండగా ఉన్న ఓ వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని నిఘావర్గాలు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆ ఆలోచనను అప్పట్లో విరమించుకున్నట్లు అధికార పార్టీలో చర్చ సాగింది.

Updated Date - 2023-06-22T16:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising