ఈ బాలిక వయసు 11 ఏళ్లు.. నెలకు రూ.1.1 కోట్ల సంపాదన.. సొంతంగా బెంజ్‌కారు.. ఇంతకీ ఏం చేసి ఇన్ని కోట్లు సంపాదిస్తోందంటే..
ABN, First Publish Date - 2023-02-24T17:19:00+05:30
పదకొండేళ్ల బాలిక. అమ్మ కొంగు పట్టుకుని తిరిగే వయసు. సహజంగా ఈ వయసులో ఇంకేముంటుంది. స్కూళ్లుకెళ్లడం. పిల్లలతో ఆడుకోవడం. ఇంతే కదా? అలా అనుకుంటే ఈ చిన్నారి విషయంలో పప్పులో కాలిసినట్లే.
పదకొండేళ్ల బాలిక. అమ్మ కొంగు పట్టుకుని తిరిగే వయసు. సహజంగా ఈ వయసులో ఇంకేముంటుంది. స్కూలుకు వెళ్లడం. పిల్లలతో ఆడుకోవడం. ఇంతే కదా? అలా ఈ చిన్నారి విషయంలో అనుకుంటే పప్పులో కాలిసినట్లే. యే? ఎందుకంటారా? ఈ పాప సంపాదించే ఆదాయమెంతో తెలిస్తే ముక్కున వేలుసుకుంటారు. అంతేకాదండోయ్.. సొంతంగా బెంజికారు, సహాయంగా అసిస్టెంట్లు కూడా ఉన్నారు. అంతేకాదు త్వరలోనే రిటైర్‌మెంట్ కూడా చేయనుంది. అదేంటి? 11 ఏళ్లలో ఏం ఉద్యోగం. పైగా ఉద్యోగ విరమణ చేయడం ఏంటి.. ఇదేదో వింతగా అనిపిస్తుంది కదా? కంగారు పడకండి. మీరు చదువుతోంది నిజమే. ఆమె చేసే పనేంటో.. ఆమె సంపాదన ఎంతో.. అప్పుడే రిటైర్‌మెంటేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఆస్ట్రేలియా (Australia)కు చెందిన పదకొండేళ్ల పిక్సీ కర్టిస్ (Pixie Curtis). తన తల్లి రాక్సీ జాసెంకో (Roxy Jacenko) ‘పిక్సీస్ పిక్స్’ అనే సంస్థ (Pixies Pix) స్థాపించింది. అయితే మదర్ ఏర్పాటు చేసిన కంపెనీ కావడంతో ఊహ తెలిసినప్పటి నుంచి పిక్సీ ఈ సంస్థలోనే ఉంటోంది. దీంతో తల్లి కూడా చిన్నారికి పోస్టు కల్పించి జీతం అందిస్తోంది. ఇలా ప్రతి నెల పిక్సీ 1,33,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.1.1 కోటి) జీతం అందుకుంటోంది. నెలకు కోటికి పైగా శాలరీ అందుకోవడంతో పిక్సీ పేరు ప్రఖ్యాతలు గడించింది. అంతేకాదు సొంతంగా డ్రైవింగ్ రాకపోయినా బెంజికార్‌లో ఇంటికి, ఆఫీస్‌కు వెళ్లి వస్తుంటుంది. ఈ కంపెనీ, పిల్లలకు సంబంధించిన హెయిర్ క్లిప్‌లు, రకరకాలైన హెడ్ బ్యాండ్స్ తయారు చేసి ఆన్‌లైన్లో విక్రయిస్తుంటుంది. దీంతో పెద్ద ఎత్తున ఆదాయం అర్జిస్తోందీ సంస్థ. అంతేకాదు సంస్థ పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా బోర్డు సభ్యులతో కూడా చిన్నారి పాల్గొనడం విశేషం.
ఇది కూడా చదవండి: ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..
అయితే చిన్నారికి ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమే కాబట్టి.. ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్ కల్పించి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తల్లి రాక్సీ జాసెంకో వెల్లడించింది. తన తల్లి చెప్పినట్టుగా చిన్నారి ఉద్యోగానికి రిటైర్‌మెంట్ ప్రకటించి, చదువుపై దృష్టి పెట్టనుందంట. అంతేకాదు పిక్సీ పదో బర్త్‌డే (birthday party ) సందర్భంగా తల్లి బెంజికారు (Benz car)ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇక 11వ పుట్టిన రోజు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారట. ఇందుకోసం సుమారు 40,000 డాలర్లు ఖర్చు చేశారు. అప్పుట్లో ఈ వార్త వైరల్‌గా మారింది.
Updated Date - 2023-02-24T17:19:02+05:30 IST