ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold: ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారుపై ఐటీ అధికారులకు డౌట్.. డిక్కీల్లో వెతికినా ఏమీ దొరక్క వదిలేద్దామనుకున్న తరుణంలో..!

ABN, First Publish Date - 2023-06-26T16:32:55+05:30

నల్ల ధనం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు దొరక్కుండా ఉండేందుకు సినిమాలోని విలన్లు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ఇళ్లలో వివిధ రకాల ప్లేస్‌ల్లో దాస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా అలాగే ప్లాన్ చేశాడు. అతడి తెలివితేటలు చూసి ఐటీ అధికారులే షాకయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్ల ధనం (Black Money) ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) అధికారులకు దొరక్కుండా ఉండేందుకు సినిమాలోని విలన్లు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ఇళ్లలో వివిధ రకాల ప్లేస్‌ల్లో దాస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (Kanpur) నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా అలాగే ప్లాన్ చేశాడు. అతడి తెలివితేటలు చూసి ఐటీ అధికారులే షాకయ్యారు. అయినా ఐటీ అధికారులు క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించి దాదాపు 12 కేజీల బంగారాన్ని (12 kg gold found in car) పట్టుకున్నారు.

కాన్పూర్‌కు చెందిన ఓ జ్యువెలరీ షోరూం యజమాని ఇంటి కింద పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు సీటు కింద 12 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అంత బంగారాన్ని చూడగానే అధికారులు కళ్లు బైర్లు కమ్మాయి.కాన్పూర్‌లోని రాధామోహన్ పురుషోత్తం దాస్ అనే నగల షాపు యజమాని ఇంటికి శనివారం ఐటీ అధికారులు చేరుకున్నారు. అయితే ఇంట్లో వారికి ఏమీ దొరకలేదు. దీంతో ఇంటి బేస్‌మెంట్‌లో పార్క్ చేసి ఉన్న కారు చూసి వారికి అనుమానం వచ్చింది.

New Research: ఆవులు, గేదెలు రోజూ ఇస్తున్న దాని కంటే ఎక్కువగా పాలు ఇవ్వాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు..!

కారును పూర్తిగా తనిఖీ చేయగా వెనుక సీటు కింద ఏకంగా 12 కేజీల బంగారం లభ్యమైంది. దీంతో ఆ బంగారం మొత్తాన్ని ఐటీ శాఖ సీజ్ చేసింది. కాన్పూర్‌లో ఉన్న ప్రముఖ జ్యువెలరీ షాప్‌ల యాజమానుల అందరి ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 8 కోట్ల నగదు, 70 కిలోల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 1500 కోట్ల నకిలీ బిల్లులను కూడా ఆదాయపు పన్ను శాఖ పట్టుకుంది.

Updated Date - 2023-06-26T16:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising