Newborn organs donation: 4రోజుల బేబీ.. ఆరుగురికి ప్రాణాలు పోసింది.. హార్ట్ టచింగ్ సంఘటన!
ABN, First Publish Date - 2023-10-21T13:59:23+05:30
అవయవ దానం అతి పెద్ద దానం' అనే మాటలను గుజరాత్ రాష్ట్రం సూరత్ (Surat) కు చెందిన ఓ జంట నిజం చేసింది. తమకు పుట్టిన నవజాత శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో వారు ధైర్యం చేసి మిగతా చిన్నారులకు ప్రాణదానం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: 'అవయవ దానం అతి పెద్ద దానం' అనే మాటలను గుజరాత్ రాష్ట్రం సూరత్ (Surat) కు చెందిన ఓ జంట నిజం చేసింది. తమకు పుట్టిన నవజాత శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో వారు ధైర్యం చేసి మిగతా చిన్నారులకు ప్రాణదానం చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో నాలుగు రోజుల బాబు అవయవాలను దానం చేశారు. దాంతో ఆరుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 13న సూరత్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమ్రేలికి చెందిన ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ నవజాత శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యులు జీవన్మృతి (బ్రెయిన్ డెడ్) గా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ జీవన్‌దీప్ ఆర్గాన్ డొనేషన్ ఆర్గనైజేషన్ (Jeevan Deep Organ Donation organization) మేనేజింగ్ ట్రస్టీ విపుల్ తలావియా, ప్రభుత్వ న్యూ సివిల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నీలేష్ కచ్చడియా శిశువు తల్లిదండ్రులను కలిశారు. అనంతరం వారికి అవయవదానం ప్రాధాన్యతను వివరించారు. దాంతో తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు.
Govt Teacher: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. స్కూల్‌లో 'సోయిలేని' పనులు.. ప్యాంట్ జిప్ విప్పేసి మరీ..
వారి అనుమతితో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8 నుంచి 10 నెలల వవయసు గల ఆరుగురు చిన్నారులకు అమర్చారు. ఈ సందర్భంగా జీవన్‌దాన్ ట్రస్టీ విపుల్ తలావియా మాట్లాడుతూ, అక్టోబరు 13న ప్రయివేట్ ఆస్పత్రిలో పుట్టిన శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కానీ, అక్కడ కూడా శిశువులో కదలిక రాలేదు. పసికందుకు వైద్యం చేసిన వైద్యులు.. ఆ నవజాత శిశువు కోలుకునే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్ (Brain dead) అయినట్లు ప్రకటించారని తలావియా అన్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యుడు నీలేష్ కచ్చడియాతో కలిసి ఆ శిశువు తల్లిదండ్రులు హర్ష్ సంఘానీ, చేతనలను కలిశామని తెలిపారు. ఆ తర్వాత వారికి అవయవదానం గురించి వివరించామని చెప్పారు. దంపతులు తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు. ఆ శిశువు నాయనమ్మ రష్మీబెన్.. అవయవదానానికి ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారని తలావీయా తెలిపారు.
Namma Yatri App: బెంగళూరు ఆటో డ్రైవర్లా మజాకా.. యాప్ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్ల సంపాదన..!
Updated Date - 2023-10-21T13:59:23+05:30 IST