ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money: ఒకే ఒక్క అబద్ధాన్ని నిజం అని నమ్మిందో 40 ఏళ్ల మహిళ.. దెబ్బకు రూ.1.59 కోట్లు మటాష్..!

ABN, First Publish Date - 2023-11-24T19:08:24+05:30

ఆ మహిళ వయసు 40 ఏళ్లు.. కొన్ని రోజుల కిందట ఆమె భర్త మరణించాడు.. ఇన్ని రోజులుగా దాచుకున్న డబ్బు, భర్త బీమా సొమ్ము కలిపి ఆమె ఖాతాల్లో భారీగా డబ్బు ఉంది. ఆ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఆమెను ట్రాప్‌లోకి లాగారు. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి ఓ భయంకర అబద్ధం చెప్పారు.

ఆ మహిళ వయసు 40 ఏళ్లు.. కొన్ని రోజుల కిందట ఆమె భర్త మరణించాడు.. ఇన్ని రోజులుగా దాచుకున్న డబ్బు, భర్త బీమా సొమ్ము (Insurance) కలిపి ఆమె ఖాతాల్లో భారీగా డబ్బు ఉంది. ఆ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఆమెను ట్రాప్‌లోకి లాగారు. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి ఓ భయంకర అబద్ధం చెప్పారు. ఆమెను మానసికంగా వేధించారు. భయపడిన ఆ మహిళ తన ఖాతాలో ఉన్న మొత్తం రూ.1.59 కోట్లను వారికి బదిలీ చేసింది. చివరకు అదంతా మోసం అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది (Crime News).

హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన భర్త చనిపోవడంతో భారీగా ఇన్సూరెన్స్ డబ్బులను పొందింది. ఈ ఏడాది ఆగస్టులో కొరియర్ కంపెనీకి చెందిన వ్యక్తి నుంచి ఆమెకు కాల్ వచ్చింది. డ్రగ్స్ ఉన్న పార్శిల్ మీ పేరుతో వచ్చిందని ఆ వ్యక్తి ఆమెకు చెప్పాడు. తాను నిర్దోషినని, తనకు ఏమీ తెలియదని బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత ముంబై పోలీసు అధికారి అని చెప్పి మరొక వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేశారు. ముంబయి నుంచి తైవాన్‌కు మీ పేరుతో వెళ్తున్న డ్రగ్స్ పార్శిల్‌ను పట్టుకున్నామని, భారీ శిక్ష తప్పదని బెదిరించాడు. స్మగ్లింగ్ కేసులో ముందస్తు అరెస్ట్ బెయిల్ తీసుకుంటే మంచిదని సూచించాడు.

Viral: నా డబ్బును నాకు తిరిగి ఇచ్చేయండి.. రాష్ట్ర ప్రభుత్వంపైనే 90 ఏళ్ల ఓ వృద్ధురాలి న్యాయపోరాటం..!

ఆ వ్యక్తి ట్రాప్‌లో పడిన బాధితురాలు బెయిల్ కోసం అని చెప్పి రూ.1.59 కోట్లను ఒకేసారి ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు తెలుసుకున్న మహిళ రాచకొండ సైబర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం కోర్టు విచారణ తర్వాత బాధితురాలికి రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా విచారణ జరుగుతోంది.

Updated Date - 2023-11-24T19:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising