ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఈ వయసులో ఫేషియల్ ఏంటి తాతా.. అని సెలూన్‌లో కుర్రాళ్ల ఎటకారం.. కట్ చేస్తే వధువు పక్కన పెళ్లిపీటలపై వరుడి స్థానంలో..!

ABN, First Publish Date - 2023-05-04T17:13:48+05:30

కొందరు వివిధ కారణాలతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతుంటారు. మరికొందరు దేవుడి సేవకు అంకితమై సన్యాసులుగా మారిపోతుంటారు. ఈ క్రమంలో కొందరి జీవితాలు మధ్యలో అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు వివిధ కారణాలతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతుంటారు. మరికొందరు దేవుడి సేవకు అంకితమై సన్యాసులుగా మారిపోతుంటారు. ఈ క్రమంలో కొందరి జీవితాలు మధ్యలో అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి జీవితంలో కూడా ఇలాగే జరిగింది. 55 ఏళ్ల వ్యక్తి సెలూన్‌కి వెళ్లి ఫేసియల్ చేయించుకుంటూ కనిపించాడు. దీంతో కుర్రాళ్లంతా.. ఈ వయసులో ఫేసియల్ ఏంటి తాతా.. అంటూ ఎటకారం చేశారు. కట్ చేస్తే మరుక్షణంలో పెళ్లి పీటలపై వరుడి స్థానంలో కూర్చున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) లాల్సోట్‌లోని రామ్‌గఢ్ పర్వారా పరిధి నోరంగ్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 55 ఏళ్ల బల్లు రామ్‌కి వివాహం కాలేదు. ఇతడికి 8మంది చెల్లెళ్లు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు చేయాలనే ఉద్దేశంతో అతను బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇతను గత 31 ఏళ్లుగా ఓ సాధువుగా మారి శివుడి సేవలో ఉన్నాడు. ఇటీవల ఇతడి జీవితం ఊహించని మలుపు తిరిగింది. స్థానిక నాపమ్‌మాస్ ప్రాంతానికి చెందిన వికలాంగురాలైన (Handicapped) 30 ఏళ్ల వినీతా మీనా పరిచయమైంది.

Viral News: ఫైవ్‌స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పాడు పని.. ఈ 23 ఏళ్ల యువతికి కోట్లలో ఆస్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..!

ఈమెను తొలిసారి చూడగానే (like) ఇష్టపడ్డాడు. ఆమెను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు. వినీతా ప్రస్తుతం వీల్‌ఛైర్‌కు పరిమితమైంది. కొన్నేళ్ల కిందట చెట్టుపై నంచి పడడం వల్ల వినీత వెన్నెముక దెబ్బతిని కాళ్లు పనిచేయలేదు. దీంతో ఆమెను వివాహం (marriage) చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న బల్లు.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి.. ‘‘నువ్వంటే నాకు ఇష్టం.. నీకూ ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటా’’.. అని చెప్పేశాడు.

Selfie with Train: హైదరాబాద్‌లో 5 ఏళ్ల క్రితం నాటి ఘటనకు సంబంధించిన వీడియో మళ్లీ వైరల్‌.. అసలు ఈ కుర్రాడికి ఏమైందంటే..!

ఇరువైపు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో వీరి వివాహం ఫిక్స్ అయింది. మే 3వ తేదీన బంధువులు, గ్రామస్తుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. బల్లు మాట్లాడుతూ ఇన్నాళ్లూ శివుడికి సేవ చేసిన విధంగానే.. వికలాంగురాలైన తన భార్యకూ (Disabled wife) సేవ చేస్తానని తెలిపాడు. బల్లు తీసుకున్న నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

Updated Date - 2023-05-04T17:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising