ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime News: ఏడేళ్ల బాలికపై 65 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. ఆ బాలిక బట్టలను పరీక్షించి నిర్ధారణ.. 20 ఏళ్ల జైలు శిక్ష!

ABN, First Publish Date - 2023-10-21T17:59:33+05:30

అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికతో పాశవికంగా వ్యవహరించిన 65 ఏళ్ల మానవ మృగానికి తగిన శాస్తి జరిగింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వరసకు మనవరాలయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు అతడు 20 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గాల్సి ఉంటుంది.

అభం శుభం తెలియని ఏడేళ్ల బాలిక (Minor Girl)తో పాశవికంగా వ్యవహరించిన 65 ఏళ్ల మానవ మృగానికి తగిన శాస్తి జరిగింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది (20 years imprisonment). వరసకు మనవరాలయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు అతడు 20 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గాల్సి ఉంటుంది. హర్యానా (Haryana)లోని నుహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది (Crime News).

నుహ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన వివాహానికి బాధిత బాలిక తన అమ్మమ్మతో కలిసి జూలై 2020లో హాజరైంది. పెళ్లి రోజు రాత్రి ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో వచ్చిన 65 ఏళ్ల నిహాల్ సింగ్ ఆ బాలికను పట్టుకుని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఆ బాలికను చీకటిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. నిందితుడిని పట్టుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

Money Tree: డబ్బులు చెట్లకు కాస్తున్నాయి.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన రోజునే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి 164 వాంగ్మూలాలను నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధిత బాలిక బట్టలపై ఉన్న వీర్య కణాల డీఎన్‌ఏ టెస్ట్ చేసి నిహాల్ సింగ్‌ను దోషిగా తేల్చారు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిహాల్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబానికి ఏడున్నర లక్షల నష్ట పరిహారం అందించాలని ఆదేశించింది.

Updated Date - 2023-10-21T17:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising