ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Govt Or Private Job: ప్రభుత్వ ఉద్యోగమా..? ప్రైవేటు జాబా..? ఏది బెస్ట్ అని ఈ యువతి వేసిన ఒక్క ప్రశ్నతో..

ABN, First Publish Date - 2023-07-22T20:11:17+05:30

తక్కువ జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఉత్తమమా? ఎక్కవ శాలరీ వచ్చే ప్రైవేట్ జాబ్ మంచిదా? ఈ ప్రశ్నకు ఎవరైనా ఏం సమాధానం చెబుతారు. జీతం కాస్త తక్కువైనా జాబ్ సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగమే ఉత్తమం అని చాలా మంది చెబుతుంటారు. ఇదే ప్రశ్నను ఆయుషీ మిశ్రా అనే యువతి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను అడిగింది.

తక్కువ జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం (Government job) చేయడం ఉత్తమమా? ఎక్కువ శాలరీ వచ్చే ప్రైవేట్ జాబ్ (Private job) మంచిదా? ఈ ప్రశ్నకు ఎవరైనా ఏం సమాధానం చెబుతారు. జీతం కాస్త తక్కువైనా జాబ్ సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగమే ఉత్తమం అని చాలా మంది చెబుతుంటారు. ఇదే ప్రశ్నను ఆయుషీ మిశ్రా అనే యువతి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను అడిగింది. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Tweet)గా మారింది. 6 లక్షల కంటే ఎక్కువ మంది ఆమె ట్వీట్‌ను వీక్షించారు. దాదాపు 3 వేల మంది ఆమె ట్వీట్‌ను లైక్ చేశారు. ఎంతో మంది ఆమె ప్రశ్నకు తమ మనసులోని మాటలను చెప్పారు.

``ఏడాదికి 7 లక్షలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయాలా? ఏడాదికి 50 లక్షలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగం ఎంచుకోవాలా?`` అని ఆయుషి అనే యువతి ట్విటర్ ద్వారా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు నెటిజన్లు తమదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ``ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ప్రైవేట్ జాబ్ మంచిది. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగమే బెస్ట్``, ```40-45 ఏళ్ల మధ్యలో రిటైర్ కావాలనుకుంటే ప్రైవేట్ జాబ్ ఎంచుకోండి. 60 ఏళ్ల వరకు పని చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగం మంచిది``, ``ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే టేబుల్ పై నుంచి రూ.7 లక్షలు వస్తాయి. టేబుల్ కింద నుంచి ఎంత వస్తాయో మరి తెలుసుకుని నిర్ణయించుకోండి`` అని కొందరు కామెంట్లు చేశారు.

Train Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రైన్ వీడియో.. ఈ కుక్క కూడా వేడుక చూసేందుకు వచ్చి..!

``మీకు మంచి స్కిల్ ఉన్నట్టైతే ప్రభుత్వ ఉద్యోగం వద్దు. ప్రైవేట్ సెక్టార్‌లో మంచి భవిష్యత్తు ఉంటుంది``, ``ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా జీవించాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగం బెస్ట్``, ``నాకు రెండూ వద్దు. రాజకీయ నాయకుడైతే విపరీతంగా సంపాదించవచ్చు``, ``ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే జాబ్‌తో పాటు చాలా పనులు చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తేనే బిజినెస్ చేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి లోన్లు కూడా సులభంగా వస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-22T20:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising