ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: వరల్డ్ రికార్డు కొట్టి గిన్నీస్ బుక్కులోకి ఎక్కేసిందిగా.. అసలు ఇంతకీ ఇదేంటో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-09-16T15:41:47+05:30

ఎలాగైతే కూరగాయల ధరలు అప్పుడప్పుడూ అందరినీ భయపెడుతుంటాయో.. అలాగే కొన్ని కూరగాయల ఆకారం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. సాదారణానికి భిన్నంగా భారీ సైజులో ఉండే కూరగాయలను చూసినప్పుడు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ప్రస్తుతం..

ఎలాగైతే కూరగాయల ధరలు అప్పుడప్పుడూ అందరినీ భయపెడుతుంటాయో.. అలాగే కొన్ని కూరగాయల ఆకారం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. సాదారణానికి భిన్నంగా భారీ సైజులో ఉండే కూరగాయలను చూసినప్పుడు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి వింత వింత కూరగాయలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు.. ‘‘ఇంతకీ ఇది కూరగాయా..? లేక పండా..?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. నార్త్ యార్క్‌షైర్‌లోని (North Yorkshire) రిపాన్ సమీపంలో ఫ్లవర్ షో (Flower show) నిర్వహిస్తున్నారు. ఏదాడిలో ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో ఈ షో నిర్వహిస్తుంటారు. కాగా, ఈసారి నిర్వహించిన షోలో గ్వెర్న్సీ ప్రాంతానికి చెందిన గారెత్ గ్రిఫిన్ అనే వ్యక్తి ప్రదర్శించిన సాగు చేసి అతి పెద్ద ఉల్లిపాయ (Big onion) అందరినీ ఆకట్టుకుంటుంది. వెజిటబుల్ కాంపిటీషన్ కోసం.. సుమారు 8.97కిలోల బరువున్న ఉల్లిపాయను స్వయంగా సాగు చేసినట్లు గారెత్ తెలిపాడు. షో నిర్వాహకులు ఈ ఉల్లిపాయను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Viral Video: నిండా పదేళ్లు కూడా లేవు.. ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఇంగ్లీషు పాఠాలు ఎలా చెప్పేస్తోందో మీరే చూడండి..!

దీన్ని గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ షోలో ఉల్లిపాయతో పాటూ భారీ సైజులో ఉండే దోసకాయ, గుమ్మడికాయ, బీట్‌రూట్, క్యారెట్ తదితర కూరగాయలను ప్రదర్శించారు. ఈ షో సెప్టెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఉల్లిపాయకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఉల్లిపాయతో ఏకంగా వంద మందికి వంట చేయొచ్చేమో’’.. అని కొందరు, ‘‘అరే! ఇది చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ రైతు ట్యాలెంట్ అద్భుతం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: గ్యాస్ లీక్ అవుతున్నట్లు ఒకటే శబ్ధం వస్తోంటే చూసేందుకు వెళ్లింది.. అయితే చివరికి ఇలాంటి సీన్ చూడాల్సి వస్తుందని ఊహించి ఉండదు..

Updated Date - 2023-09-16T15:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising