ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anti-Aging: అసలు సీక్రెట్‌ను బయటపెట్టిన బడా వ్యాపారవేత్త.. 45 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు వయసును ఎలా తగ్గించాడంటే..!

ABN, First Publish Date - 2023-08-01T15:33:32+05:30

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటు చేసుకుని వృద్ధాప్య ఛాయలు రావడం అనేది సహజం. అది ప్రకృతి ధర్మం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును తగ్గించుకోవడం అనేది సాధ్యం కాదు. కొందరు వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

సాధారణంగా వయసు (Age) పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటు చేసుకుని వృద్ధాప్య ఛాయలు (Oldage)రావడం అనేది సహజం. అది ప్రకృతి ధర్మం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును తగ్గించుకోవడం అనేది సాధ్యం కాదు. అయితే కొందరు వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాలీఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ (Bryan Johnson) అనే బడా వ్యాపార వేత్త ఇలాంటి ప్రయత్నాలతోనే వార్తల్లోకి ఎక్కారు. 45 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కనిపించేందుకు ప్రత్యేక చికిత్స పొందుతున్నారు (Anti-aging mission). ఏడాదికి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.16 కోట్లు) ఖర్చు చేసి మరీ జాన్సన్ ఈ చికిత్స అందుకుంటున్నారు.

సాధారణంగా ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించిన వయసు కంటే అతడి జీవసంబంధమైన వయసు (Biological age) తక్కువగా ఉండొచ్చు అని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జీవ సంబంధమైన వయసు అంటే శరీరంలోని కణాలు, కణజాలాలు, అవయవాల వయసు. బ్రియాన్ చెబుతున్న దాని ప్రకారం చికిత్స, వ్యాయామాల కారణంగా ప్రస్తుతం అతడి గుండె సామర్థ్యం 37 ఏళ్ల వ్యక్తిలా, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా మారిపోయింది. ఇందుకోసం చికిత్స మాత్రమే కాదు.. ప్రతిరోజూ 30 రకాల వ్యాయామాలు చేస్తూ బ్రియాన్ యువకుడిలా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యాయామాలను బ్రియాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral Video: వామ్మో.. బైక్‌పై ఇద్దరమ్మాయిల రొమాన్స్.. బైక్ హ్యాండిల్ వదిలేసి మరీ లిప్‌లాక్.. వీడియో వైరల్!

బ్రియాన్ వారానికి ఏడు రోజులు, రోజుకు 45 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేస్తారు. తాను మారథాన్ వంటి ఈవెంట్ కోసం శిక్షణ పొందడం లేదని, బాడీబిల్డర్ లాగా బాడీ పెంచాలనే లక్ష్యంతో వ్యాయామాలు చేయడం లేదని, వృద్ధాప్య వేగాన్ని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలు చేస్తున్నానని చెప్పారు. బ్రియాన్ తన హృదయ స్పందన రేటు (Heart Rate)ను నిమిషానికి 159 బీట్స్ కంటే ఎక్కువ చేయడానికి ఈ వ్యాయామాలు చేస్తారు. వారంలో 90 నుంచి 150 నిమిషాల పాటు బ్రియాన్ హార్ట్ రేట్ 159 బీట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకోసం కఠినమైన వ్యాయామాలు చేస్తారు. అలాగే వ్యాయామాలు చేయడంతో పాటు తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. కొవ్వు తక్కువగా ఉండే హార్మోన్ తీసుకోవడం వల్ల టెస్టొస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. కాబట్టి ఇంజెక్షన్ రూపంలో టెస్టొస్టిరాన్ హార్మోన్ తీసుకుంటారు.

Updated Date - 2023-08-01T15:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising