ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tent boy: 10 ఏళ్ల బాలుడు.. రోజూ టెంటులో నిద్రపోయి ఏకంగా రూ.7 కోట్లు కూడబెట్టాడు..!

ABN, First Publish Date - 2023-03-09T17:17:26+05:30

కొంత మంది సినిమాలు చూసి ప్రేరణ పొందుతారు. మరికొందరు పుస్తకాలు చదివి ఇన్‌స్పైర్ అవుతారు. ఇంకొందరు గొప్ప వ్యక్తుల జీవితాలను చూసి మోటివేట్

రూ.7 కోట్లు కూడబెట్టాడు..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొంత మంది సినిమాలు చూసి ప్రేరణ పొందుతారు. మరికొందరు పుస్తకాలు చదివి ఇన్‌స్పైర్ అవుతారు. ఇంకొందరు గొప్ప వ్యక్తుల జీవితాలను చూసి మోటివేట్ అవుతుంటారు. జీవితంలో గొప్పవాళ్లు కావాలనుకునే వాళ్లంతా ఎవర్నొకర్ని మార్గదర్శిగా తీసుకుంటారు.. దీనికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడో ఓ బాలుడు. అంతేకాదు మూడేళ్లలో ఏడు కోట్లు సంపాదించాడు. ఆ బాలుడు అన్ని కోట్లు ఎలా సంపాదించగలిగాడు. నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన ఆ బాలుడి హిస్టరీ తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

బ్రిటన్‌కు (Britain) చెందిన మాక్స్ వూసే (Max Woosey) పదేళ్ల బాలుడు. అతని ఇంటి సమీపంలోనే రిక్‌ అబాట్ (Rick) అనే ఓ పెద్ద వ్యక్తి నివసించేవాడు. ఆయన మ్యాక్స్‌ కుటుంబానికి సన్నిహితుడు. 74 ఏళ్ల వయసులో రిక్‌ అబాట్ క్యాన్సర్‌ (Cancer)తో మృతిచెందాడు. రిక్‌ జీవించే కాలంలో మాక్స్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడటంతో రిక్‌ తన దగ్గర ఉన్న టెంట్‌ను మ్యాక్స్‌కు బహుమతిగా అందజేశాడు. దీంతో ఏదైనా సాహస కార్యం చేయమని సలహా ఇచ్చాడు. ఆ మాటలు మ్యాక్స్‌‌ మెదడులో బలంగా నాటుకుపోయాయి. దీంతో 2020 మార్చిలో తాను ఇంట్లో కాకుండా మూడేళ్ల పాటు ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే ఓ ఆస్పత్రి స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం ఆ పదేళ్ల వయసులో తన తోటలో నిద్రించడం ప్రారంభించాడు. అలా టెంట్‌ల్లో నిద్రపోతూ విరాళాలు సేకరించడం ప్రారంభించాడు. ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు మాక్స్‌కు విరాళాలు పంపించారు. ఇలా సేకరించగా మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7కోట్లకు చేరింది.

అంతేకాదు మ్యాక్స్‌ కృషికి గుర్తింపుగా పలు అవార్డులు కూడా దక్కాయి. బ్రిటిష్‌ అంపైర్‌ మెడల్‌, బేర్‌గ్రిల్స్‌ చీఫ్‌ స్కౌట్‌ అన్‌సంగ్ హీరో అవార్డు, ఎ ప్రైడ్‌ ఆఫ్‌ బ్రిటన్‌ అవార్డులు అతడిని వరించాయి. ఇక మ్యాక్స్‌ తన మూడేళ్ల టెంట్‌ నిద్రకు ముగించే ముందు ఏప్రిల్ 1న సంబరాలు చేయబోతున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును కూడా స్వచ్ఛంద సంస్థకు పంపిస్తానని మ్యాక్స్‌ తెలిపాడు.

ఇది కూడా చదవండి: Bangalore: ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌ హెల్మెట్‌ లాక్కుని.. నేలకేసి కొట్టి.. ఓ ఆటో డ్రైవర్ వార్నింగ్.. వేరే దేశం నుంచి వచ్చి మరీ మా పొట్ట కొడుతున్నారంటూ..

Updated Date - 2023-03-09T17:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising