ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: ఏడాది వయసున్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. స్కానింగ్ చేసి మెదడులో ఏముందో చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..!

ABN, First Publish Date - 2023-03-11T17:47:02+05:30

చైనా (China)లోని షాంఘైలో ఏడాది వయసు కలిగిన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని పరిశీలించిన డాక్టర్లు.. తలకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతోందని.. అలాగే శరీర కండరాల్లో కూడా

నివ్వెరపోయిన డాక్టర్లు..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇటీవల రాజస్థాన్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ తల్లి వింత శిశువుకు జన్మనిచ్చిన సంఘటన గుర్తుంది కదా? రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు వెన్నెముకలతో పాప పుట్టడం అనంతరం కొన్ని నిమిషాలకే చనిపోవడం జరిగింది. ఇలా అక్కడక్కడ వింత శిశువులు పుట్టడం చనిపోవడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఏడాది చిన్నారి మెదడు స్కానింగ్‌ చేస్తే షాకింగ్ సీన్ బయటపడింది. ఆ దృశ్యాన్ని చూసిన డాక్టర్లే నివ్వెరపోయారు.

చైనా (China)లోని షాంఘైలో ఏడాది వయసు కలిగిన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని పరిశీలించిన డాక్టర్లు.. తలకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతోందని.. అలాగే శరీర కండరాల్లో కూడా సరైన కదలికలు సరిగా లేవని గుర్తించారు. దీంతో వెంటనే సిటీ స్కాన్‌ (City Scan)కు రిఫర్ చేశారు. వైద్యులు స్కాన్ చేసి చూడగా షాకింగ్ విషయం బయటపడింది. మెదడులో పిండం తయారైనట్లుగా గుర్తించారు. నాలుగు అంగుళాల పిండానికి పలు అవయవాలతో పాటు వేళ్ల గోర్లు కూడా అభివృద్ధి చెందినట్లుగా స్కానింగ్‌లో తేలింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ అవయవాలు చిన్నారి మెదడులో అభివృద్ధి చెంది ఉంటామని డాక్టర్లు భావిస్తున్నారు. గర్భంలో ఉన్నప్పుడు కవల పిల్లల్లో (twins) ఒక పిండం ఎదిగి... మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలు వస్తామని తేల్చారు. అంటే పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు విభజన సరిగా జరగకపోవడం వల్ల ఒక పిండం మెదడులో మరో పిండం కలిసిపోయిందని పేర్కొన్నారు. గర్భంలోని కవలల విభజన అసంపూర్ణంగా జరిగినందునే చిన్నారికి ఈ సమస్య వచ్చిందని డాక్టర్లు స్పష్టం చేశారు. ఇలాంటి అరుదైన కేసును ‘ఫీటస్‌ ఇన్‌ ఫీటు’ అంటారని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Wife Twist: అత్తారింట్లో ముభావంగా ఉంటోంటే కొత్త కదా అని అంతా అనుకున్నారు.. కానీ సరిగ్గా నెల తర్వాత ఆ కోడలు చేసిన పనికి..

Updated Date - 2023-03-11T17:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising