ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: నువ్వు కట్టిన తాళి.. నీ దగ్గరే ఉంచుకో.. మెడలోంచి తీసిచ్చిన 23 ఏళ్ల యువతి.. చివరి నిమిషంలో 29 ఏళ్ల ఆ కుర్రాడికి భారీ షాక్..!

ABN, First Publish Date - 2023-05-26T13:43:21+05:30

పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రక్షణ కోసం స్టేషన్‌కు వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అసలేం జరిగిందో

Bride
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలిసీతెలియని వయసులో అబ్బాయిలు.. అమ్మాయిలు ఆకర్షణకు గురికావడం.. ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం నిత్యం ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొంత మంది పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు తల్లిదండ్రులకు దూరంగా పారిపోయి జీవిస్తుంటారు. ఈ జంట కూడా అలానే ప్రేమించుకున్నారు. పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రక్షణ కోసం స్టేషన్‌కు వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

తమిళనాడులోని తిరుపూర్‌ పూండి రింగ్‌రోడ్‌కు చెందిన యువతి (23). కోయంబత్తూర్‌ జిల్లా అన్నూర్‌ ఒటర్‌పాళయంకు చెందిన 29 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయం తెలిసి పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో గత 17న యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న నగలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పారిపోయింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వెలంపాళయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతి ఇంటి నుంచీ వెళ్లిపోయి నేరుగా అన్నూర్‌లో ఉన్న ప్రియుడిని కలుసుకుంది. అనంతరం అక్కడే ఓ గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం భద్రత కల్పించాలంటూ ప్రేమికులిద్దరూ అన్నూర్ పోలీసులను ఆశ్రయించారు. అన్నూర్‌ పోలీసులు మాత్రం ప్రేమ జంటను వెలంపాళయం పోలీస్‌స్టేషన్‌‌కు పంపించారు. స్టేషన్‌కు చేరుకున్నాక పోలీసులు.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు స్టేషన్‌కు చేరుకుని కుమార్తెను చూసి బోరున విలపించారు. పేరెంట్స్ పడుతున్న ఆవేదన చూసి ఆ యువతి మనసు కరిగిపోయింది. తనకు తల్లిదండ్రులే కావాలంటూ తెగేసి చెప్పింది. అనంతరం మెడలో ఉన్న తాళి తీసి ప్రియుడికి ఇచ్చేసి అతడి తప్పులేదంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇక పోలీసులు చేసేదేమీ లేక యువకుడికి సర్ది చెప్పి పంపించేశారు.

ఇది కూడా చదవండి: Wife: అర్థం చేసుకునే భార్య దొరకడం అంటే ఇదే కదా.. భర్త బైక్ నడుపుతూ ఉంటే వెనుకే కూర్చున్న ఆమె ఏం చేసిందో మీరే చూడండి..!

ఇది కూడా చదవండి: Bride: వరుడి మెడలో దండ వేయకుండా.. సడన్‌గా గదిలోకి వెళ్లిపోయిన వధువు.. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన నిర్వాకంతో..!

ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లయి పట్టుమని ఏడాది.. ఏం పాపం చేశారని ఈ జంటకు ఇంత పెద్ద శిక్ష..!

Updated Date - 2023-05-26T13:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising