ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. ఇదెక్కడి చోద్యం.. గుర్రంతో సహా మాల్‌లోకి వెళ్లి షాపింగ్ చేసిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-09-24T15:30:26+05:30

షాపింగ్ అంటే ఎవరికి ఇష్టముండదు? షాపింగ్ మాల్ మొత్తం తిరిగి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఇంటి నుంచి ఎవరైనా బస్సు, బైక్, కార్లలో షాపింగ్ మాల్స్‌కు వెళ్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి గుర్రంపై షాపింగ్‌కు వెళ్లాడు. నేరుగా గుర్రంతోనే మాల్‌లోకి ప్రవేశించాడు.

షాపింగ్ (Shopping) అంటే ఎవరికి ఇష్టముండదు? షాపింగ్ మాల్ (Shopping Mall) మొత్తం తిరిగి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఇంటి నుంచి ఎవరైనా బస్సు, బైక్, కార్లలో షాపింగ్ మాల్స్‌కు వెళ్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి గుర్రం (Horse)పై షాపింగ్‌కు వెళ్లాడు. నేరుగా గుర్రంతోనే మాల్‌లోకి ప్రవేశించాడు. గుర్రంపై కూర్చుని తిరుగుతూ తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.

అమెరికా (America)లోని టెక్సాస్‌ (Texas)లో ఉన్న వాల్‌మార్ట్‌ (Walmart)లో ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తెల్ల గుర్రంపై షాపింగ్ మాల్ లోపలికే వెళ్లిపోయాడు. మాల్‌లో గుర్రంపై తిరుగుతూ తనకు కావాల్సిన వస్తువులు బకెట్‌లో వేసుకున్నాడు. ఆ తర్వాత గుర్రం మీదే కౌంటర్ దగ్గరకు వెళ్లి బిల్ వేయించుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనను మాల్‌లో ఉన్న వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: సెకెండ్ హ్యాండ్ సైకిల్ కొని ఇంటికి తీసుకెళ్లిన తండ్రి.. దానిని చూసిన కొడుకు ఏం చేశాడో చూడండి..

@MadVidss అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``వాల్‌మార్ట్‌లో గుర్రం కోసం కూడా షాపింగ్ చేస్తున్నాడు``, ``ఆ గుర్రానికి కూడా ఆ మాల్ బాగా అలవాటు అయినట్టు ఉంది``, ``టెక్సాస్ డౌన్‌లో ఇలాంటివి సాధారణమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-24T15:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising