Wife: ఏం భర్తవయ్యా బాబూ.. కట్టుకున్న భార్య పరువు తీసేలా ఇదేం పాడు పని.. మొదటి భార్యతో కలిసి పక్కా ప్లాన్..!
ABN, First Publish Date - 2023-07-28T17:15:39+05:30
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆ వ్యక్తి కట్టుకున్న భార్య పరువు తీసేందుకు కుట్ర పన్నాడు. మొదటి భార్యతో కలిసి రెండో భార్యను సమాజంలో చులకన చేసేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని మొదట్లోనే పసిగట్టిన మహిళ తన భర్త, అతడి మొదటి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్‌కు చెందిన ఆ వ్యక్తి కట్టుకున్న భార్య (Wife) పరువు తీసేందుకు కుట్ర పన్నాడు. మొదటి భార్య (First Wife)తో కలిసి రెండో భార్య (Second Wife)ను సమాజంలో చులకన చేసేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని మొదట్లోనే పసిగట్టిన మహిళ తన భర్త, అతడి మొదటి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).
ఇండోర్ (Indore)లోని ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన వసీమ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. కొద్ది రోజుల క్రితం వరకు అతడు రెండో భార్య వద్దే ఉండేవాడు. ఆ తర్వాత ఆమెతో గొడవపడి మొదటి భార్య ఫోజియా వద్దకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండో భార్య పరువు తీసి ఆమెకు విడాకులు ఇచ్చేందుకు స్కెచ్ వేశాడు. అందుకు ఫోజియా కూడా సహకరించింది. ఇద్దరూ కలిసి బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ (Fake Account) క్రియేట్ చేశారు. ఆ అకౌంట్ ద్వారా అసభ్యకర వీడియోలు, ఫొటోలు, మెసేజ్‌లు (objectionable content) సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు.
Wife: నా భర్త కనిపించడం లేదంటూ కేసు పెట్టిన భార్య.. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఆమెనే పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక..!
ఆమె మొబైల్ నెంబర్ ఇచ్చి ఆమెను శీలం లేని మహిళగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. తనపై జరుగుతున్న కుట్రను బాధితురాలు గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు ప్రారంభించారు. బాధితురాలు ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
Updated Date - 2023-07-28T21:17:29+05:30 IST