ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: పాత గోడను రూ.41 లక్షలకు అమ్మకానికి పెట్టిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-08-28T13:27:55+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) లో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. అదేంటంటే.. ఓ పాత గోడను అమ్మకానికి పెట్టడం. అవును మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తి నిజంగానే తనకు చెందిన ఓ పాత గోడను రూ.41లక్షలకు అమ్మకానికి పెట్టాడు.

Viral News: అగ్రరాజ్యం అమెరికా (America) లో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. అదేంటంటే.. ఓ పాత గోడను అమ్మకానికి పెట్టడం. అవును మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తి నిజంగానే తనకు చెందిన ఓ పాత గోడను రూ.41లక్షలకు అమ్మకానికి పెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే.. ఆ ప్రాంతంలో ఒక పెద్ద భవంతి ధరే రూ.10 కోట్లకు మించి ఉండదట. అలాంటిది మనోడు కేవలం ఓ పాత గోడను అంత ధరకు అమ్మకానికి పెట్టడంతో అక్కడి స్థానికులు నోరెళ్లబెడుతున్నారట. అసలు ఆ వ్యక్తి ఎందుకు పాత గోడను అమ్మకానికి పెట్టాడు? దాని వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

వాషింగ్టన్ డీసీ (Washington DC) లోని ఓల్డ్ జార్జిటౌన్‌లో ఉందీ అమ్మకానికి ఉన్న గోడ. గోడలో కొంత భాగం అలెన్ బర్గ్, మరికొంత భాగం డేనియలా వాల్స్ అనే మహిళ పేరు మీద ఉంది. ఇక అలెన్ నిర్లక్ష్యం వల్ల గోడ నుంచి నీరు లీక్ కావడంతో తన ఇల్లు దెబ్బతింటోందని డేనియెలా చాలా బాధపడుతుంది. ఈ క్రమంలో గోడ (Wall) మరమ్మతుల కోసం చాలా ఖర్చు చేశానని అలెన్ చేతులెత్తేశాడు. ఇక ఈ గోడ విషయమై ఇద్దరి మధ్య గొడవలు ముదిరి టౌన్ ప్లానింగ్ అధికారుల వరకు వెళ్లింది. దాంతో గోడతో అంత ఇబ్బందిగా ఉంటే మీరే కొనుక్కోండి అంటూ అలెన్ దాన్ని 50 వేల డాలర్లకు(రూ.41 లక్షలు) అమ్మకానికి పెట్టాడు.

అయితే, కూలిపోయే గోడకు అంత ఇచ్చేది లేదని డేనియెలా చెబుతోంది. దానికి 600 డాలర్లు (సుమారు రూ.50 వేలు) మాత్రమే ఇస్తానని భీష్మించుకుని కూర్చుంది. పాతగోడకు అంత ఖరీదు ఎవరూ ఇవ్వరని అలెన్‌కు స్థానిక పెద్దలు నచ్చజెబుతున్నా మనోడు మాత్రం వినడం లేదట. ఇక అలెన్ ఈ గోడను అమ్ముతానని పత్రికల్లో ఫొటోతో సహా ప్రకటన ఇవ్వడంతో ఈ విషయం కాస్తా నెట్టింట ప్రత్యక్షమైంది. ఇప్పుడు దీనిపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది.

Man Fakes Death: 'చావు' తెలివితేటలంటే ఇవే కాబోలు.. అందరినీ నమ్మించేశాడు.. కానీ ఒక చిన్న పొరపాటు అతణ్ని పట్టించింది..!


Updated Date - 2023-08-28T13:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising