Viral Video: ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడ్డాం.. భారీ ట్రాలీ బ్యాగ్‌లను బైక్‌పై కూర్చుని ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి..
ABN, First Publish Date - 2023-08-29T15:39:28+05:30
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చని చాలా మంది ఇప్పటికే రుజువు చేశారు. మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినపుడు భారీ లగేజీని తీసుకెళ్తుంటాం. వాటిని మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. బైక్ మీద వెళ్తే లగేజీ పెట్టడానికి స్థలం ఉండదని, కార్లు, ఆటోలు బుక్ చేస్తుంటాం.
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చని చాలా మంది ఇప్పటికే రుజువు చేశారు. మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినపుడు భారీ లగేజీ (Luggage)ని తీసుకెళ్తుంటాం. వాటిని మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. బైక్ మీద వెళ్తే లగేజీ పెట్టడానికి స్థలం ఉండదని, కార్లు, ఆటోలు బుక్ చేస్తుంటాం. అయితే ఓ యువకుడు లగేజీ ట్రాలీ బ్యాగ్‌లను (Trolley bags) బైక్‌పై తీసుకెళ్లడానికి చాలా సులభమైన మార్గం కనిపెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
@RoadsOfMumbai అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోలో, బైక్ వెనుక ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఓ వ్యక్తి బైక్ (Bike) నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి తన భుజానికి ఒక బ్యాగ్‌ని తగిలించుకుని, రెండు చేతులతో రెండు ట్రాలీ బ్యాగ్‌లను పట్టుకున్నాడు. బైక్‌తో పాటు ఆ ట్రాలీ బ్యాగ్‌లు సునాయాసంగా ముందుకు వెళ్లిపోతున్నాయి. వెనుక కారులో వెళ్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Shocking Video: వామ్మో.. ఇంత భారీ కొండచిలువా? చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. చెట్ల మీదకు ఎలా పాకుతోందో చూడండి..
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ టెక్నిక్ చాలా బాగుంది``, ``ఆటోలో కూడా ఇంత లగేజీ తీసుకెళ్లడం కష్టమేమో``, ``రోడ్లు బాగుంటే ఇది మంచి ఐడియా``, ``ట్రాలీ చక్రాలు పాడైపోతాయి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-08-29T15:39:28+05:30 IST