ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఫొటోలో ధీనంగా కనిపిస్తున్న మహిళ కథేంటో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే 16 ఏళ్లు వెనక్కు వెళ్లాల్సిందే..!

ABN, First Publish Date - 2023-03-04T17:48:22+05:30

సినిమాల్లో ప్లాష్ బ్యాక్‌లు చూస్తుంటాం. కొన్ని సినిమాలు ప్లాష్ బ్యాక్‌లు లేకుండా ఎండింగ్ కార్డు పడదు. ఇది కూడా ఓ సినిమా స్టోరీలాంటిదే. కాకపోతే ఇది రియల్ స్టోరీ. దీనికి

16 ఏళ్లు వెనక్కు వెళ్లాల్సిందే..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సినిమాల్లో ప్లాష్ బ్యాక్‌లు చూస్తుంటాం. కొన్ని సినిమాలు ప్లాష్ బ్యాక్‌లు లేకుండా ఎండింగ్ కార్డు పడదు. ఇది కూడా ఓ సినిమా స్టోరీలాంటిదే. కాకపోతే ఇది రియల్ స్టోరీ. దీనికి కూడా గత చరిత్ర ఉంది. ఈ కథేంటో తెలియాలంటే ప్లాష్ బ్యాక్ వెళ్లాల్సిందే. ఏంటా కథ? ఏంటా ప్లాష్ బ్యాక్? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఫొటోలో దీనంగా కనిపిస్తున్న మహిళను చూస్తుంటే ఏదో అమాయకురాలు అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే. ఓ మహిళ.. బిడ్డను కనడమంటే మరో జన్మ ఎత్తడం అంటారు. ఎందుకంటే తొమ్మిది మాసాలు గర్భంలో మోసి బిడ్డను కనడమంటే చనిపోయి మళ్లీ పుట్టడమే అంటారు. అలాంటిది ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు సంతానం. ఆ ఐదుగుర్నీ ఒక్కరోజునే పొట్టనబెట్టుకుంది. తల్లి కూడా వారితో పాటు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది. కాకపోతే ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం భర్తకు విడాకులు ఇవ్వడం.. ఆమెకు యావజ్జీవ శిక్ష తర్వాత అనాయాస మరణానికి గురికావడం జరిగిపోయింది. ఇంతకీ అసలేం ఏమైంది.. వారెలా చనిపోయారు. ఆమెకు జీవత ఖైదు ఎందుకు పడింది. భర్తకు విడాకులు ఎందుకిచ్చిందో తెలియాలంటే ప్లాష్ బ్లాక్ వెళ్లాల్సిందే.

ఇది కూడా చదవండి: China: రూటు మార్చిన చైనా కంపెనీలు.. లో దుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు నటించకూడదని ప్రభుత్వం నిషేధిస్తే..

ఇదొక దిగ్భ్రాంతికర సంఘటన. బెల్జియం (Belgium) లో 2007లో దేశాన్ని కుదిపేసిన ఓ విషాదకర ఘటన. ఫిబ్రవరి 27, 2007న నివెల్లెస్‌ పట్టణంలోని లెర్మిట్టే అనే మహిళ 14 సంవత్సరాల కుమారుడు, నలుగురు కూతుళ్లను గొంతుకోసి (five children) చంపేసింది. ఆ చిన్నారుల తండ్రి ఇంట్లో లేని సమయంలో ఆమె (mother) ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. అనుహ్యంగా ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే కోర్టు ఈ దారుణానికి ఒడిగట్టినందుకు 2008లో ఆమెకు జీవిత ఖైదు విధించింది.

అయితే విచారణలో ఆమె చెప్పిన విషయాలు అధికారులనే కంటతడి పెట్టించాయి. ‘నేను ఈ దారుణానికి ఒడిగట్టినరోజు ఓ సూపర్‌ మార్కెట్‌ (Supermarket) నుంచి రెండు కత్తులను దొంగలించినట్లు తెలిపింది. ఆ రోజు పిల్లలు భోజనం చేశాక తలుపులు లాక్‌ చేసి మరీ చంపేశానని చెప్పుకుచ్చింది. క్షణికావేశంలో పిల్లలందర్నీ పొగొట్టుకున్నాను. ఇది నాకు భరించలేని ఆవేదన. నా చివరి రోజుల వరకు దీన్ని అనుభవిస్తాను. ఇదే నాకు సరైన శిక్ష’’ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె భర్తకు సైతం విడాకులు ఇచ్చింది. ఈ విషాద ఘటన జరిగి నేటికి సుమారు 16 ఏళ్లైంది. బెల్జియం చట్టాల ప్రకారం భరించలేని నయం చేయలేని మానసిక బాధతో ఇబ్బంది పడుతుంటే అనాయాస మరణానికి (కారుణ్య మరణం) అనుమతిస్తుంది.

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

ఇదే విషయాన్ని లెర్మిట్టే కోర్టుకి (Court) నివేదించింది. 2019లో ఆమెను మానసిక ఆస్పత్రికి తరలించి చికిత్స కూడా అందించారు. తీవ్ర మనోవేదనను మర్చిపోలేకపోతుందని, అది నయం కానిదని వైద్యులు సైతం ధృవీకరించడంతో న్యాయస్థానం ఆమెకు అనాయాస మరణానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆమె అనాయాస మరణం పొందినట్లు బెల్జియం స్థానిక మీడియా (Media) పేర్కొంది. బుధవారమే ఆమె అంత్యక్రియలు కూడా జరిగినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఇది డెత్ మెషీన్... అనాయాస మరణానికి చట్టబద్ధ మార్గం.. వివరాలివే..

Updated Date - 2023-03-04T17:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising