ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..

ABN, First Publish Date - 2023-03-06T17:41:43+05:30

పిల్లలకు వయసు వచ్చినప్పుడు పెళ్లిళ్లు చేయడం. ఆ తర్వాత వేరే కాపురం పెట్టించడం. అనంతరం నూతన వధూవరులు సంతోషంగా గడిపేందుకు హనీమూన్‌కు పంపించడం.. ఇలా పెద్దలు ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లైన

హనీమూన్‌కు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పిల్లలకు వయసు వచ్చినప్పుడు పెళ్లిళ్లు చేయడం. ఆ తర్వాత వేరే కాపురం పెట్టించడం. అనంతరం నూతన వధూవరులు సంతోషంగా గడిపేందుకు హనీమూన్‌కు పంపించడం.. ఇలా పెద్దలు ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లైన కొత్త జంటలందరూ ఏదొక కొత్త ప్రాంతానికి వెళ్లడం జరుగుతుంటాయి. వివాహం అనంతరం అలానే ప్లాన్ చేసుకుంది ఓ కొత్త జంట. అది కాస్త రివర్స్ అయి మృత్యువు అంచుల దాకా వెళ్లింది. వెంట్రుకవాసి దూరంలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లేదంటే నూరేళ్ళు నూకలు చెల్లేవి. ఇలాంటి పరిస్థితికి కారణమైన ఓ ట్రావెల్ సంస్థపై ఆ దంపతులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. 40 కోట్లు చెల్లించాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇంతకీ అసలు ఏమైంది? ప్రాణాల మీదకు తెచ్చిన ఆ పరిస్థితి ఏంటి? ఆ కపుల్స్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కాలిఫోర్నియాకు (California) చెందిన ఎలిజబెత్‌ వెబ్‌స్టెర్‌, అలెగ్జాండర్‌ బర్కల్‌లు 2021లో పెళ్లి (Wedding) చేసుకున్నారు. పెళ్లైన తర్వాత హనీమూన్‌కు (Honeymoon) ప్లాన్ వేసుకున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని (America) హవాయి దీవుల్లోని (Hawaii) లనాయ్‌ ప్రాంతానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందుకోసం ‘సెయిల్‌ మౌయీ’ అనే పర్యాటక ఏజెన్సీని సంప్రదించారు. అనంతరం సెప్టెంబర్‌ 2021లో టూర్‌కు వెళ్లారు. ట్రావెల్ సిబ్బంది డైవింగ్‌ మాస్కులు, స్విమ్‌ సూట్‌ ధరింపజేసి సముద్ర గర్భంలోకి ‘స్నొర్కెలింగ్‌’కు (Snorkelling) బయలుదేరారు. ఇలా సుమారు 44 మంది పర్యాటకులతో బోటు సముద్రంలోకి (Ocean) వెళ్లి ఓ చోట నిలిపింది. అనంతరం ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిన బోట్‌ కెప్టెన్‌ (Boat captain).. ఎక్కడకెళ్లాలో.. ఎంత సమయంలో తిరిగి రావాలో చెప్పకుండా ఈతకు పంపించాడు.

ఇది కూడా చదవండి: Kacha Badam: ఇతడెవరో గుర్తు పట్టారా..? కచ్చా బాదమ్ అనే ఒక్క పాటతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు కానీ.. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..

గైడ్ చెప్పినట్టుగా టూరిస్టులంతా సముద్రంలోకి ఈతకు వెళ్లారు. అలా ఓ గంటసేపు నీటిలో ఈత కొట్టిన ఆ దంపతులకు సముద్రం అల్లకల్లోలంగా మారినట్లుగా గమనించారు. దీంతో కంగారు పడిన ఆ జంట 15 నిమిషాల పాటు ఈదుకుంటూ బోటు దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే ఆ బోటు అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోవడాన్ని గుర్తించారు. భయాందోళనకు గురైన ఆ జంట.. బోటును చేరుకునేందుకు ఎంత ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేకపోయింది. దీంతో చేసేదేమీలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతి కష్టం మీద ఒడ్డు వరకూ ఈదుకుంటూ వచ్చారు. అప్పటికే వారిద్దరూ ఈత కొట్టడంతో సత్తువ కోల్పోవడం.. ప్రాణం అలసిపోవడంతో అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం సమీపంలో నివసించే ఐలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి సహాయం చేయడంతో ఆ జంట ఊపిరి పీల్చుకుంది. ఈ పరిస్థితి అంతటికి కారణమైన ట్రావెల్ సంస్థపై ఆ జంట ప్రతీకారంతో రగిలిపోయింది. తమను మానసికంగా.. భయాభ్రాంతులకు గురిచేసిన ఏజెన్సీ సంస్థని కోర్టుకు ఈడ్చింది. ట్రావెల్ ఏజెన్సీ కారణంగా తమ ప్రాణాలకు ముప్పు కలిగిందని, పరిహారంగా 5 మిలియిన్ డాలర్లు (రూ.40కోట్లు) చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 23న కోర్టులో దావా వేసింది.

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..

Updated Date - 2023-03-06T17:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising