ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: కొద్ది గంటల్లో పెళ్లి.. ఊరేగింపుతో వరుడు వచ్చాడని తెలిసి ఇంట్లోంచి వధువు ఎస్కేప్.. 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొస్తే..

ABN, First Publish Date - 2023-05-17T17:55:39+05:30

ఓ బాలికకు గుండు గీయించి అనంతరం ఆ బాలికపై చెప్పులు, బూట్లతో దండ వేసి. అనంతరం దాడి చేసి ఊరేగించారు.

marriage
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి.. అమ్మాయిల ఇష్టాలను తెలుసుకుని వివాహం చేయాలి. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయి. చాలా మంది తల్లిదండ్రులు తమకు నచ్చినట్టుగా పిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆ తర్వాత కాపురంలో గొడవలు.. సమస్యలు తలెత్తి విడాకుల వరకూ వెళ్లి విడిపోయిన సంఘటనలు ఎన్నో చూసుంటాం. వినుంటాం. అలా జరగకుండా ఉండాలంటే ముందు చూపుతో వ్యవహరించడం అవసరం. ఇదంతా ఎందుకంటారా? పెళ్లి ఇష్టం లేదన్న పాపానికి ఓ యువతికి ఘోరమైన శిక్ష విధించింది గ్రామం. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగిడిహ్ గ్రామంలో దారుణం జరిగింది. పంచాయితీ బోర్డు ఓ బాలికకు (tribal girl) గుండు గీయించి అనంతరం ఆ బాలికపై చెప్పులు, బూట్లతో దండ వేసి. అనంతరం దాడి చేసి ఊరేగించారు (paraded). బాలికను గ్రామం చుట్టూ తిప్పిన నిందితులు.. అనంతరం గ్రామం వెలుపలికి తీసుకెళ్లి అడవిలో మరణించు అంటూ వదిలిపెట్టారు. సమాచారం అందుకున్న పటాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు జోగిడిహ్‌ గ్రామానికి చేరుకుని బాధితురాలిని అడవి నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం మేదిని రాయ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గత నెల ఏప్రిల్ 19న అమ్మాయి పెళ్లి (marriage) చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ముహూర్త సమయానికి వరుడు పెళ్లి ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి వచ్చాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. తనకు ఇష్టం లేదని ఇంటి నుంచి పారిపోయింది. పరిస్థితులు అన్ని సద్దుమణిగాక.. సుమారు 20 రోజుల తర్వాత అమ్మాయి తన ఇంటికి తిరిగి వచ్చింది. అంతే ఈ ఘటనపై గ్రామ పెద్దలు మండిపడ్డారు. అమ్మాయిని క్యారెక్టర్‌లెస్‌గా అభివర్ణిస్తూ ఊరిలోని మిగతా అమ్మాయిలు ఇలా ఇంటి నుంచి పారిపోకూడదని కఠినమైన నిర్ణయానికి సిద్ధపడ్డారు. అమ్మాయికి శిక్ష విధించిన పంచాయితీ బోర్డు... ఆమెకు గుండు చేశారు. అనంతరం బూట్ల దండ.. చెప్పుల దండ వేసి.. అటు తర్వాత ఆమెను కొట్టి గ్రామంలో ఊరేగించేలా చేశారు. మొత్తం గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. అనంతరం ఆ యువతిని గ్రామం నుంచీ వెలివేశారు. ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో గ్రామస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రమేయం ఉందని పేర్కొంది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న మరికొందరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Husband: కొడుకు పెళ్లిలో వేరే వాళ్లతో డాన్స్ చేసిన భార్య.. మర్నాడే ఇద్దరిని చంపేసిన భర్త.. ఆపై హాయిగా నిద్రపోతోంటే..!

Updated Date - 2023-05-17T17:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising