భారతదేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక వీడియో క్యాప్చర్ అవుతోంది..ఆ సైట్లను చూసే ముందు ఆలోచించండి..!
ABN, First Publish Date - 2023-02-27T12:10:34+05:30
ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్(Porn addiction) పెరుగుతూ వస్తోంది. దీని వల్ల మనుషుల్లో హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోతోంది. ఇది చిన్నారులపై లైంగిక దాడులు ...
ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్(Porn addiction) పెరుగుతూ వస్తోంది. దీని వల్ల మనుషుల్లో హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోతోంది. ఇది చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి దారి తీస్తోంది. దీని కట్టడికి యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్లో చైల్డ్ పోర్న్ గ్రఫీ (Child pornography)జోలికి వెళ్తే.. జైలుకి వెళ్లడం ఖాయమని అంటోంది. చైల్డ్ పోర్న్ గ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫోటోలు షేర్ చేసినా.. చివరికి వీక్షించినా కూడా నేరంగా పరిగణిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే..ఐదేళ్ల పాటు.. ఊచలు లెక్కపెట్టాల్సిందే.. ఇంటర్నెట్(Internet)తో పాటు సోషల్ మీడియా(Social media)లో చైల్డ్ పోర్న్ గ్రపీపై కన్నేసి ఉంచటానికి నేషనల్ సెంటర్ ఫ్రామింస్ అండ్ ఎక్స్ ప్లాయిట్(National Center Framins and Exploit) పని చేస్తోంది.
ఇది పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి..వీడియోలు, ఫోటోలు సెర్చ్ చేస్తున్నవారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్(Advanced software) వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగా.. గతవారంలో హైదరాబాద్‌లో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. చైల్డ్ పోర్న్ గ్రఫీ గురించి సెర్చ్ చేసినా.. వీక్షించినా, డౌన్లోడ్, అప్లోడ్, వారు వినియోగించిన కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఐపీ అడ్రస్‌లను సాఫ్ట్వేర్ గుర్తిస్తోంది. ఈ వివరాలను గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు పంపిస్తారు. వారు కేసు నమోదు చేసి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా.. అరెస్ట్ లేదా..నోటీసులిచ్చేందుకు చర్యలు చేపడతారు. భారతదేశం(India)లో ప్రతి 40 సెకన్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోందని అంచనా వేసింది.
జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణంకాల ప్రకారం..2021లో భారత్ నుంచి 25వేలకు పైగా.. చైల్డ్ పోర్న్ గ్రఫీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. ఆన్లైన్లో చైల్డ్ పోర్న్ గ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్ఎంఎన్సీ(MNC) గుర్తించింది. కోవిడ్ లాక్డౌన్, ఆ తర్వాత సమయంలో ఈ దొరణి మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోనులు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్ సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసలుగా మారుతున్నారు. చైల్డ్ పోర్న్ గ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు, 2019లో 103 కేసులు నమోదు కాగా, 2020కి నాటికి ఈ సంఖ్య 738, 2021లో 969కి పెరిగింది.
ఇది కూడా చదవండి: చికెన్ బిర్యానీలో పిల్లి మాంసం ముక్కలు..షాకైన కస్టమర్లు..!
ఇన్ని ఉదంతాల్లో ఒక్కశాతం కూడా పోలీస్ కేసుగా మారడం లేదని నిపుణులు అంటున్నారు. చైల్డ్ పోర్న్ గ్రఫీ ఆరోపణలపై గతేడాది హైదరాబాద్‌లో 23 కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాదికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కోర్టులో నేరం రుజువైతే.. మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్ఠంగా.. ఐదేళ్లు.. రెండవసారి అయితే..ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే..పోక్స్ యాక్ట్ కింద కూడా నమోదవుతాయి. దోషిగా తెలితే జీవిత ఖైదు పడే ఆస్కారం ఉంది.
Updated Date - 2023-02-27T12:21:39+05:30 IST