ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

women clothes: ఆరబెట్టిన కాసేపటికి మాయమవుతున్న మహిళ దుస్తులు.. చివరకు సీసీ కెమెరా ఫుటేజీ చూడగా.. యువకుడు చేసిన నిర్వాకం..

ABN, First Publish Date - 2023-07-02T21:36:25+05:30

మహిళలు నిత్యం ఇంటా, బయటా అనే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఇంట్లో భర్త చిత్రహింసలతో అవస్థలు పడుతుంటే.. మరికొందరు బయట ఆకతాయిల వేధింపులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలు నిత్యం ఇంటా, బయటా అనే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఇంట్లో భర్త చిత్రహింసలతో అవస్థలు పడుతుంటే.. మరికొందరు బయట ఆకతాయిల వేధింపులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు విచిత్ర సమస్య వచ్చి పడింది. ఆరబెట్టిన దుస్తులు ఎప్పటికప్పుడు మాయమవుతుండడంతో మహిళకు అనుమానం కలిగింది. చివరకు సీసీ కెమెరా ఫుటేజీ చూడగా.. పక్కటి యువకుడు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

గుజరాత్ (Gujarat) అహ్మదాబాద్‌లోని ధంధూకా తహసీల్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ తన దుస్తులు (women clothes) ఉతికి ఆరేసే క్రమంలో రోజూ ఆమె లోదుస్తులు కనిపించకుండా పోయేవి. మొదట ఎలాంటి అనుమానం కలగలేదు. అయితే రోజూ తన లోదుస్తులు (innerwear) మాత్రమే కనిపించకుండా పోతుండడాన్ని కొన్నాళ్లకు గమనించింది. ఎందుకు ఇలా జరుగుతోందో ఆమెకు మొదట అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో దుస్తులు ఆరబెట్టే ప్రాంతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయించింది. తర్వాత రోజూ లాగే తన దస్తులు ఆరబెట్టి వెళ్లింది. ఉదయం సీసీ కెమెరా ఫుటేజీ (CCTV footage) చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది.

woman: ప్రేమికుడిని అర్ధరాత్రి ఇంటికి పిలిచిన వివాహిత.. కాసేపటికి పొలంలో కనిపించడంతో.. ఓ వ్యక్తికి అనుమానం వచ్చి చూడగా..

పక్కింటి యువకుడు అక్కడికి వచ్చి.. తన లోదుస్తులను ఎత్తుకెళ్లడం చూసి మహిళ షాక్ అయింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన యువకుడు దుర్భాషలాడుతూ తిరిగి ఆమెపైనే దాడికి దిగాడు. గట్టిగా కేకలు వేయడంతో మహిళ కుటుంబ సభ్యులు, బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. చివరకు అంతా కలిసి కర్రలతో (Attack with sticks) యువకుడితో పాటూ అతడి బంధువులపై కూడా దాడి చేశారు. ఇరువర్గాల ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో సుమారు 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. ఇరువర్గాలకు చెందిన 20మందిని అరెస్ట్ చేశారు. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణలో యువకుడు 8ఏళ్లుగా లోదుస్తులను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

Updated Date - 2023-07-02T21:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising