Viral Video: కారుపై ప్రేమికుల ముద్దూ, ముచ్చట.. లక్నోలో మరో రొమాన్స్ సీన్.. వైరల్ అవుతున్న వీడియో!
ABN, First Publish Date - 2023-01-24T19:14:52+05:30
ఇటీవల లక్నోలో ఒక జంట స్కూటర్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు వారిని పట్టుకుని శిక్ష కూడా విధించారు. ఆ ఘటన మరవక ముందే మరో జంట లక్నో రోడ్డుపైనే కారులో వెళుతూ రొమాన్స్ సాగించారు.
ఇటీవల లక్నోలో ఒక జంట స్కూటర్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు వారిని పట్టుకుని శిక్ష కూడా విధించారు. ఆ ఘటన మరవక ముందే మరో జంట లక్నో రోడ్డుపైనే కారులో వెళుతూ రొమాన్స్ సాగించారు (Lucknow Car Romance). ఆ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఓ జంట కారు సన్ రూఫ్ తెరిచి బయటకు వచ్చింది. కారు వెళ్తుండగానే ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. వెనుక వస్తున్న వారు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను పూర్తిగా నిషేధించాలని, ఇది చాలా ప్రమాదకరమైన డ్రైవింగ్ అని కామెంట్ చేశారు.
Updated Date - 2023-01-24T19:14:55+05:30 IST