ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వేగంగా దూసుకొస్తున్న రైలు.. అయినా రైల్వే ట్రాక్ దాటిన కారు.. అక్కడితో ఆగకుండా ఆ డ్రైవర్ ఏం చేశాడంటే..!

ABN, First Publish Date - 2023-09-23T20:28:41+05:30

కొందరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వేగంగా వెళ్లి పోవాలనే తొందరలో కొద్ది సేపు నిరీక్షణను కూడా తట్టుకోలేరు. అడ్డదారుల్లో వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురువుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు.

కొందరు డ్రైవింగ్ (Rash Driving) చేస్తున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వేగంగా వెళ్లి పోవాలనే తొందరలో కొద్ది సేపు నిరీక్షణను కూడా తట్టుకోలేరు. అడ్డదారుల్లో వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురువుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవక తప్పదు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ (Railway Crossing) దగ్గర వేచి ఉండలేక ప్రమాదానికి ఎదురెళ్లాడు. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ క్రమంలో రైల్వే ఆస్థికి నష్టం కలిగించాడు.

రైలు వస్తుండగా గేటు మూసేస్తున్న సమయంలో ఆల్టో కారులో వెళ్తున్న వ్యక్తి తొందరపడ్డాడు (Car breaks railway crossing). ఒక గేటు మూసేస్తున్న సమయంలో లోపలికి వెళ్లిపోయాడు. అదే సమయంలో రైలు వేగంగా వస్తోంది. రైలు వచ్చే కొద్ది సెకెన్లకు ముందు లైన్‌ను క్రాస్ చేశాడు. మూసి ఉన్న గేటును బద్దలుకొట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో రైల్వే గేటు వంగిపోయింది. కారు పై భాగం కూడా దెబ్బతింది. ఆ కారు నెంబర్‌ను రైల్వే గేట్ మ్యాన్ వీడియో తీశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 2.16 గంటలకు జరిగింది.

Google Maps: మీ వల్లే నా భర్త చనిపోయాడంటూ గూగుల్‌పై కేసు పెట్టిందో భార్య.. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా ఫాలో అవడంతో..!`

Bihar_se_hai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. 4 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి``, ``ఆ కారు డ్రైవర్‌కు మెదడు పని చేయడం లేదనుకుంటా``, ``ఇది నాన్-బెయిలబుల్ నేరం``, ``ఇతడికి ఎలాంటి శిక్ష విధించారో అందరికీ తెలియాలి. అప్పుడే మిగతా వాళ్లు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-23T20:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising