Nandamuri Kalyan Ram: 'అమిగోస్' సినిమా ఫలితం ఏంటి?
ABN, First Publish Date - 2023-02-13T15:10:02+05:30
'అమిగోస్'సినిమా విడుదల అయిన మొదటి రోజే కలెక్షన్స్ అంతగా లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా అదే కంటిన్యూ అయింది, అందువల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్' (#Amigos) గతవారం శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమా గురించి ప్రచారం బాగానే చేశారు, అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. దీనికి రాజేందర్ రెడ్డి (Rajender Reddy) దర్శకుడు, ఇది అతని మొదటి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే కలెక్షన్స్ అంతగా లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రెండో రోజు, మూడో రోజు కూడా అదే కంటిన్యూ అయింది, అందువల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది. ఎంతో ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ (Not good openings) కూడా రాకపోవటం తో కొంచెం నిరాశ పడ్డాడు అనే చెప్తున్నారు.
మొదటగా తెలుగు సినిమాకి ఆంగ్ల (English) టైటిల్ పెట్టడం వలన కుటుంబ ప్రేక్షకులు అంతగా ఆ సినిమా పట్ల ఆసక్తి చూపించే అవకాశం ఉండదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అదీ కాకుండా 'అమిగోస్' అనే టైటిల్ కూడా 'బి', 'సి' సెంటర్ ప్రేక్షకులకి అర్థం కాకపోయి ఉండవచ్చు అని కూడా అంటున్నారు. దానికి తోడు ఇది 'డాపుల్ గేంగర్' (Doppelganger) నేపధ్యం లో కథ వుంది అని సినిమా విడుదలకి ముందు చెప్పారు, కానీ అది అంతగా జనాలలోకి తీసుకు వెళ్లలేకపోయారు. ఇవన్నీ కాకుండా, సినిమాలో (#Amigos) హాస్య సన్నివేశాలు బాగా కొరవడ్డాయి అనే మాట బాగా వినపడుతోంది. బ్రహ్మాజీ (Brahmaji) లాంటి నటుడుని పెట్టుకొని సరి అయినా హాస్య సన్నివేశాలు రాయలేకపోయారు రచయితలు అని కూడా అంటున్నారు.
ఇంక సినిమాలో కళ్యాణ్ రామ్ మాటల్లోనే చెప్పాలంటే రెండు గంటల 19 నిముషాల సినిమాలో (2 hours 19 minutes) రెండు గంటల 17 నిముషాలు కళ్యాణ్ రామ్ నే తెర మీద చూడవచ్చు. ఇది కూడా సినిమాకి ఒక మైనస్ అనే చెప్తున్నారు. మొదటి సగం సినిమా దర్శకుడు ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఇంక రెండో సగం లో సినిమా మొదలయ్యేసరికి దర్శకుడు మనిషిని పోలిన మనుషులు వుంటారనే అందరికీ తెలిసినా, అది నమ్మగలిగేట్టు చెయ్యలేకపోయాడు. భావోద్వేగాలు కూడా బాగా కొరవడ్డాయి. అందుకే ఈ సినిమాకి కలెక్షన్స్ రాలేదు అని అంటున్నారు. ఈ సినిమా థియేటర్ హక్కులు సుమారుగా 15 కోట్ల (Theaterical rights 15 crore) వరకు ఉంటుంది, కానీ మూడు రోజులకు గాని సుమారు 4.5 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని, ఇది చాలా తక్కువ అని చెపుతున్నారు. ఇది రెవిన్యూ పెరగటం కష్టమే అని కూడా అంటున్నారు. (#Amigos) 'బింబి సార' (#Bimbisara) తో మంచి విజయం నమోదు చేసుకున్న కళ్యాణ్ రామ్ కి ఈ 'అమిగోస్' నిరాశ పరిచిందనే చెప్పాలి.
Updated Date - 2023-02-13T15:10:03+05:30 IST