ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anand Mahindra Scorpio: ‘స్కార్పియో విఫలమైతే పరిస్థితి ఎలా ఉండేదో..ఆనంద్ మహీంద్రా..

ABN, First Publish Date - 2023-07-02T18:49:02+05:30

ఐడియల్ పోస్టులతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహింద్రా గ్రూప్ ) చైర్మన్ఆ నంద్ మహీంద్రా ..ఈసారి తన లైఫ్‌లో తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐడియల్ పోస్టులతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహింద్రా గ్రూప్(Mahindra Group) చైర్మన్(Chairman) ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)..ఈసారి తన లైఫ్‌లో తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీ స్కార్పియో కథ నుంచి జీవిత స్ఫూర్తిని పొందాం అంటూ నెటిజన్లు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రా ఏం నిర్ణయం తీసుకున్నాడు.. నెటిజన్లకు ఎలా ఇన్‌స్పిరేషన్ అయ్యాడో తెలుసుకుందాం..

ఇటీవల ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రా ఓ పోస్ట్ షేర్ చేశాడు.. అందేంటంటే.. మహంద్రా కంపెనీ తయారు చేసిన స్కార్పియో గురించి. ఇది భారతీయ డిజైన్, ఇంజనీరింగ్‌తో మహింద్రా కంపెనీ ప్రారంభించిన మొదటి ఉత్పత్తి. మహింద్రా గ్రూప్‌కు స్కార్పియో ఒక టర్నింగ్ పాయింట్. మహీంద్రా టీం కృషి వల్లే స్కార్పియో విజయవంతమైందని, ఎన్నో రిస్క్‌లు అధిగమించి సక్సెస్ చేశారని’’ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు.

స్కార్పియో 2002లో ప్రారంభించబడిన స్పాట్ యూటిలిటీ వెహికల్. ఇది మహీంద్రా కంపెనీకి అతిపెద్ద విజయం సాధించిపెట్టింది. ఇండియా ఆటోమొబైల్ రంగంలో ఆనంద్ మహీంద్రా ప్రధాన పాత్ర పోషించడంలో ఇది కీలకంగా సహాయపడింది.

స్కార్పియో గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకవేళ స్కార్పియో గాక సక్సెస్ కాకపోయి ఉంటే.. నేను బోర్డు మెంబర్లలో ఉండేవాడిని కాదేమో’’ అని ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన నిజాయితీని మెచ్చుకున్నారు..రిస్క్ తీసుకునేందుకు ఆయన ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని తెగ పొగుడుతున్నారు. అంతేకాదు స్కార్పియో గొప్ప కారు..భారత ఆటోమొబైల్ రంగాన్నే మార్చేసిందని మరో నెటిజన్ అన్నారు. ఆనంద్ మహీంద్రా తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చారని మరో నెటిజన్ ప్రశంసించారు. నిజమే కదా..

Updated Date - 2023-07-02T18:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising