ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. జిరాఫీకి కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. టూరిస్ట్‌లను ఎంత దూరం తరిమిందో చూడండి..

ABN, First Publish Date - 2023-08-22T11:55:23+05:30

అడవి చాలా థ్రిల్స్ అందిస్తుంది. అక్కడి వాతావరణం, వన్య మృగాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆ ఆసక్తికర అనుభవం అందుకునేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్‌ల పేరుతో అడవి యాత్రలకు వెళుతున్నారు. క్రూర మృగాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అడవి (Forest) చాలా థ్రిల్స్ అందిస్తుంది. అక్కడి వాతావరణం, వన్య మృగాలు (Wild Animlas) ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆ ఆసక్తికర అనుభవం అందుకునేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్‌ల (Safari Tour) పేరుతో అడవి యాత్రలకు వెళుతున్నారు. క్రూర మృగాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటితో కలిసి ఫొటోలు దిగుతున్నారు. అయితే అప్పుడప్పుడు వాటి ఆగ్రహానికి గురై పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి వైరల్ (Viral Video) అవుతోంది.

సింహాలు, ఎలుగుబంట్లు, పులులు వంటి క్రూర జంతువులే కాదు సాధు జంతువులైన జిరాఫీలు, ఏనుగులు కూడా అప్పుడప్పుడు అసహనానికి గురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో పర్యాటకులకు చుక్కలు చూపిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ జిరాఫీ ఓ జీప్‌ను వెంబడిస్తోంది (Giraffe chases tourists). అది చాలా వేగంగా పరుగులు పెడుతూ జీప్‌ను ఛేజ్ చేస్తోంది. జిరాఫీ (Giraffe) దగ్గరగా వచ్చినప్పుడు సందర్శకులు గట్టిగా అరుపులు, కేకలు వేశారు. వాహనంలో ఉన్న సందర్శకుడు ఈ వీడియోను తీశాడు.

Viral Video: ఈ కోతి ట్యాలెంట్ మామూలుగా లేదు.. పుచ్చకాయను బాస్కెట్‌లోకి ఎలా వేసిందో చూడండి..

సాధారణంగా జిరాఫీలు శాంతియుతంగా ఉంటాయి. కాకపోతే మనుషులకు త్వరగా మచ్చిక కావు. జిరాఫీలు బెదిరింపులకు గురైతే తప్ప దాడి చేయవు. ఈ వీడియో @MoreCrazyClips అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4.9 లక్షల మంది వీక్షించారు. జిరాఫీ కోపాన్ని చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2023-08-22T11:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising