నాన్‌వెజ్ తినేవారికి ఈ విషయం తెలుసా..!
ABN, First Publish Date - 2023-02-23T12:54:08+05:30
జంతు మాంసం, ప్రాసెసుడ్ ఫుడ్ వల్ల కలిగే ముప్పుపై ఇటీవల కాలంలో అనేక నివేధికలు సంచలనం రేపాయి. ప్రాసెసుడ్ మీట్
జంతు మాంసం, ప్రాసెసుడ్ ఫుడ్ వల్ల కలిగే ముప్పుపై ఇటీవల కాలంలో అనేక నివేధికలు సంచలనం రేపాయి. ప్రాసెసుడ్ మీట్ నిల్వ ఉండేందుకు వినియోగించే నైట్ రైట్లు, నైట్ రైట్ ల వినియోగానికి వ్యతిరేకంగా..శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు. నైట్రేట్ల కారణంగా.. క్యాన్సర్ వస్తుందని పలు అధ్యయనాలు చెప్పడంతో ఇలా జరిగింది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే..నాన్‌వెజ్ అనేది ఈ రోజుల్లో సాధారణ ఆహారంగా మారింది. నాన్‌వెజ్ ప్రతి రోజు తినేవారు కూడా ఉన్నారు. అది లేకపోతే ముద్ద దిగే పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే దాని వల్ల అనారోగ్యాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కులోరెక్టల్ క్యాన్సర్ లేదా బౌవల్ క్యాన్సర్.
ఇదీ వస్తే మాత్రం శరీరంలో చాలా తేడాలుంటాయి. ఊరికే అలసట వస్తుంది. దానితో పాటు క్రమంగా నీరసం కూడా వస్తుంది. మూత్రంలో బ్లడ్ పడటం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్‌కి ప్రధాన కారణం జంతు మాంసం. ఫ్రైలు, ఆయిల్, స్పైసీ ఆహారం, ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాసం లేదా ఎరుపు రంగులోకి మాంసం మారినా..ప్రాసెస్ చేసి ప్యాకింగ్ రూపంలో వచ్చే మాంసం తినేవారికి పెద్ద పెగుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు గానూ.. రేడియో థరపీ, కిమియో థరపీ ఉన్నాయి. అయితే.. తొలి దశలోనే దీన్ని అదుపు చేయవచ్చని అంటున్నారు. అసలు రాకుండా కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం..రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువగా జంతు మాంసం తింటే క్యాన్సర్ వస్తుంది. వారానికి 350 గ్రాముల కంటే ఎక్కువగా తింటే ఈ క్యాన్సర్ వస్తుంది. ఫ్రై చేసినా, ప్రాసెస్ చేసిన మాంసం కంటే.. ఇంట్లో వంట చేసుకుని తినడం మంచిదంటున్నారు. క్లోమం ప్రోస్టెట్ క్యాన్సర్లకు కూడా జంతు మాంసం కారణంగా మారుతుంది. జంతు మాంసాన్ని ఎక్కువగా వెయించడం, నిప్పులో కాల్చుక తినడం, వెపుళ్లు చేసుకోవడం, ఉప్పులో నానబెట్టిన తర్వాత మంచిదని సూచిస్తున్నారు. ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే ఆ క్యాన్సర్ రాదని అంటున్నారు.
Updated Date - 2023-02-23T12:54:10+05:30 IST