ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Geyser: గీజర్‌ను వాడుతున్నారా..? ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. అది బాంబులా పేలడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-11-14T16:25:11+05:30

చలికాలం వచ్చిందంటే చాలు శరీరాన్ని చలి బారి నుంచి కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక స్నానం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వేడి నీరు ఉండాల్సిందే. పల్లెటూర్ల సంగతి పక్కన పెడితే.. పట్టణాలు, నగరాల్లో ఉన్న వారు విధిగా వాటర్ హీటర్లు వాడుతుంటారు. చలి కాలంలో..

చలికాలం వచ్చిందంటే చాలు శరీరాన్ని చలి బారి నుంచి కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక స్నానం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వేడి నీరు ఉండాల్సిందే. పల్లెటూర్ల సంగతి పక్కన పెడితే.. పట్టణాలు, నగరాల్లో ఉన్న వారు విధిగా వాటర్ హీటర్లు వాడుతుంటారు. చలి కాలంలో ఏ ఇంట్లో గమనించినా వేరే ఏ వస్తువు లేకున్నా గీజర్లు మాత్రం విధిగా దర్శనమిస్తుంటాయి. అయితే బాత్రూంలో గీజర్ (Geyser) వాడే వారు కొన్ని విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బాంబులా పేలడం మాత్రం ఖాయం. ఇంతకీ ఆ జాగ్రత్తలేంటో వివరంగా తెలుసుకుందాం..

ప్రస్తుత ఆధునిక యుగంలో పట్టణాలు, నగరాలు.. ఆఖరికి పల్లెల్లోనూ చాలా మంది వాటర్ హీటర్లను (Water heaters) వాడుతున్నారు. అయితే వీరిలో చాలా మందికి వాటి వినియోగంపై సరైన అవగాహన లేక తీవ్రంగా నష్టపోతున్నారు. హీటర్ల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఉన్నట్టుండి టైం బాంబుల్లా పేలడం గ్యారెంటీ. అయితే ముందు జాగ్రత్తలు (Precautions) తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

గీజర్‌ని సరైన పద్ధతిలో ఏర్పాటు చేయాలి. ఇందులో ఏమాత్రం తప్పు జరిగినా వేడి కావడంలో సమస్య ఏర్పడుతుంది. అలాగే హీటర్‌లో నీరు చేరడం వల్ల షార్ట్ సర్క్యూట్‌ అయ్యే అవకాశం ఉంది. దీన్ని అధిగమించేందుకు తరచూ హీటర్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి.

ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఎక్కువగా లీక్ అవుతూ ఉంటే ట్యాంక్ లోపల వేడితో పాటూ ఒత్తిడి కూడా ఉందని అర్థం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు గీజర్ పగిలిపోయే అవకాశం ఉంటుంది.

గీజర్ నుంచి పదే పదే శబ్ధాలు వస్తున్నా కూడా అప్రమత్తంగా ఉండాలి. హీటర్‌లో నీరు చాలా కాలంగా నిల్వ ఉన్నప్పుడు.. వేడి కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల ట్యాంక్ లోపల వేడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో శబ్ధాలు వస్తుంటాయి. ఇలా వచ్చినా వెంటనే గీజర్‌ని ఆఫ్ చేయాలి.

కొన్నిసార్లు గీజర్ నుంచి కుళ్లిన గుడ్డు వాసన వస్తుంటుంది. గీజర్ లోపల గ్యాస్ లీక్ అవడం వల్ల ఇలా జరుగుతుందనే విషయం గ్రహించాలి. ఇలాంటి సమయంలో వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి, మెకానిక్‌లకు సమాచారం అందించాలి.

పై జాగ్రత్తలు తీసుకోవడంతో పాటూ గీజర్ వాల్వ్ దెబ్బతిన్నా కూడా వెంటనే మార్చాలి. అదేవిధంగా హీటర్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 120-125 డీగ్రీల వద్ద ఉంచండి. దీంతో పాటూ ఏడాదికి ఒకసారి సర్వీస్ కూడా చేయించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదలు జరగకుండా ఉంటాయి.

Updated Date - 2023-11-14T16:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising