ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Apollo Doctor: హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు 6 మెడిసిన్స్.. ఓ అపోలో డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్.. నెట్టింట యమా వైరల్..!

ABN, First Publish Date - 2023-06-13T13:42:01+05:30

ప్రస్తుతకాలంలో ఆరోగ్యమంతా దినదిన గండం దిగులే నిత్యం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకో, చుట్టుప్రక్కల వారికో ఏదైనా జరిగినప్పుడు కొందరు మరీ ఎక్కువగా భయపడిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ తో 'నాకు హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఏదైనా ఒక మెడిసిన్ రాసివ్వండి డాక్టర్' అని అడిగాడు. అయితే ఆ డాక్టర్ ఒకటికి బదులు ఆరు మందులు ప్రిస్కిప్షన్ లో రాశాడు. ప్రస్తుతం ఈ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యమే మహాబాగ్యం అన్నారు పెద్దలు. అయితే ప్రస్తుతకాలంలో ఆరోగ్యమంతా దినదిన గండం దిగులే నిత్యం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకో, చుట్టుప్రక్కల వారికో ఏదైనా జరిగినప్పుడు కొందరు మరీ ఎక్కువగా భయపడిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ తో 'నాకు హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఏదైనా ఒక మెడిసిన్ రాసివ్వండి డాక్టర్' అని అడిగాడు. అయితే ఆ డాక్టర్ ఒకటికి బదులు ఆరు మందులు ప్రిస్కిప్షన్ లో రాశాడు. ప్రస్తుతం ఈ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. బాగా గమనిస్తే కోవిడ్ దాడి తరువాత హార్ట్ అటాక్ కేసులు(after covid heart attack cases increase) చాలా దారుణంగా పెరిగాయి. అందుకే ఏ చిన్న సమస్య ఎదురైనా ముందు జాగ్రత్తగా హాస్పిటల్స్ కు వెళ్ళిపోతుంటారు. 35సంవత్సరాల ఓ వ్యక్తి (35 years man)తండ్రికి రీసెంట్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తరువాత అతని తండ్రి కోలుకున్నా అతనిలో మాత్రం భయం చుట్టుముట్టింది. తనకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అనే భయం(man fear about heart attack) అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. దీంతో అతను హైదరాబాదులో ఉన్న ప్రముఖ అపోలో హాస్పిటల్ కు(man visit Hyderabad Apollo hospital) వెళ్ళాడు. అక్కడ న్యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్(Apollo neurologist DR Sudhir Kumar) ను కలసి తన భయం చెప్పుకుని 'నాకు హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండటానికి మీరే ఏదైనా మందు రాసివ్వండి డాక్టర్' అని అడిగాడు. దీంతో ఆ డాక్టర్ ఒకటికి బదులు ఆరు మందులు రాసిచ్చాడు. ఆ ప్రిస్కిప్షన్ ను డాక్టర్ సుధీర్ కుమారే స్వయంగా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆయన రాసిన ఆరు రకాల మందులు ఏంటంటే..

ఓ చిన్న కాటన్ ముక్క చాలు.. పుచ్చకాయ సహజంగా పండిందో.. రసాయనాలతో పండించారో ఈజీగా తెలుసుకోవచ్చు..!


1. రోజూ 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి.(Daily 7-8 hrs sleep)

2. వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు రోజూ 30 నుండి 40నిమిషాలు చేయాలి.(30-40 mins walking/running)

3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వదిలెయ్యాలి. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ మొదలైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.(Healthy food)

4. రోజువారి పనిగంటలను 13-14 నుండి 8-9 గంటలకు తగ్గించుకోవాలి.(working hrs reduce 13-14 to 8-9)

5. ధూమపానం, మధ్యపానానికి దూరంగా ఉండాలి.(avoid smoking/drinking)

6. ఒత్తిడిని తగ్గించుకోవాలి.(reduce stress)

ఈ ఆరు పాటిస్తే హార్ట్ అటాక్ దరిచేరదు అని ఆ డాక్టర్ రాశారు.

ఈ ప్రిస్కిప్షన్ ను ట్విట్టర్ లో DR Sudhir Kumar MD DM తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రిస్కిప్షన్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. 'డాక్టర్ సుధీర్ లాంటి వైద్యులు మాకు చాలామంది కావాలి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అద్భుతమైన ఫ్రిస్కిప్షన్, మాకు కావాల్సింది ఇలాంటివే' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఈ డాక్టర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు' అని మరికొందరు కామెంట్ చేశారు.

Hair Fall: ఈ 5 అలవాట్లను వదిలేయండి చాలు.. జుట్టు రాలడం దానంతట అదే ఆగిపోవడం ఖాయం..!


Updated Date - 2023-06-13T13:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising