ఆపిల్ తినేవారు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి..లేదంటే అంతే సంగతి..!
ABN, First Publish Date - 2023-02-22T12:23:18+05:30
కొన్ని పండ్లు కొన్ని సమయాల్లో మాత్రమే తినాలి. అలాగే ఆపిల్ కూడా ఒక సమయం సందర్భం ఉన్నాయి. అలా తినకపోతే అంతే సంగతులు..
కొన్ని పండ్లు కొన్ని సమయాల్లో మాత్రమే తినాలి. అలాగే ఆపిల్ కూడా ఒక సమయం సందర్భం ఉన్నాయి. అలా తినకపోతే అంతే సంగతులు..లేదంటే నానా రకాల బాధలు పడాలి. ఇది ఎవరు గమనించి ఉండరు ఇంతవరకు. అసలు సంగతికి వస్తే.. ప్రతి రోజు ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే నిత్యం ఒక ఆపిల్ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిజానికి ఆపిల్ మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంటుంది. దాని ద్వారా మనకు అనేక పోషకాలు కూడా అందుతాయి. అయితే చాలా మందికి రోజులో ఏదో ఒక సమయంలో ఆపిల్ తినాలనే విషయంపై సందేహపడుతుంటారు. అసలు ఆపిల్ ను ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని దాదాపు చాలమంది ప్రజలకు తెలుసు. ఆపిల్ లో మినరల్స్, విటమిన్స్, యాంటి యాక్సిడెంట్లు, విటమిన్ సీ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే ఆపిల్ తినడం వల్ల మన శరీరానికి కావాలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ పండును సంపూర్ణ పోషణగా ఇచ్చే ఆహారంగా చెప్పవచ్చు. అయితే.. పండు తినకూడని సమయం కూడా ఉంది. రోజులో ఎప్పుడైనా ఆపిల్ పండు తినవచ్చు. కానీ రాత్రిపూట మాత్రం తినవద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. దానికి ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును రాత్రిపూట తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల అజీర్తి సమస్య వచ్చే అవకాశం ఉంది.
జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలగవచ్చు. ఆపిల్ పండుతో పాటు రాత్రిపూట ఇతర ఆహారలు కూడా జీర్ణం కావు. దీన్ని వల్ల గ్యాస్, మలబద్ధకం సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట ఆపిల్ పండును తినే అలవాటును వదులుకోవడం మంచింది. ఆపిల్ ను పగటి పూట తినడం చాలా ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఆపిల్ లో ఉండే పెక్టిన్ పీచు పదార్థాలు ఆపిల్ ను ఉదయం లేదా రాత్రి తింటే అందులో ఉండే పెక్టిన్ పీచు పదార్థం వల్ల ఆపిల్ త్వరగా జీర్ణం కాదు. ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఈ పండు తినడం ఆరోగ్యానికి మేలు. ఆపిల్ పండు రాత్రిపూట తినడం వల్ల కలిగే..చిన్న ఇబ్బంది ఇదే కానీ, కొందరిలో చిన్న ఇబ్బంది కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే పోషకాహార నిపుణులు రాత్రిపూట ఆపిల్ తినడం మానేయడమే మంచిందని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే.. జీర్ణ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచింది.
Updated Date - 2023-02-22T12:23:20+05:30 IST