ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Apple seeds: యాపిల్‌ను తింటూ.. దానిలోని విత్తనాన్ని పారేస్తున్నారా..? అయితే ఈ నిజం తెలుసుకోవాల్సిందే..!

ABN, First Publish Date - 2023-10-10T10:25:52+05:30

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదంటారు. కానీ యాపిల్ విత్తనాల వెెనక ఉన్న నిజమిదే..

ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరించే పండ్లలో యాపిల్ పండు మొదటి వరుసలో ఉంటుంది. రోజుకొక యాపిల్ తింటే అసలు డాక్టర్ అవసరమే ఉండదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెబుతుంటారు. యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువ, కొలెస్ట్రాల్ ఉండదు. యాపిల్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ శక్తి 1,500 మిల్లీగ్రాముల విటమిన్ సికి సమానం. యాపిల్ లో ఇంత గొప్ప గుణాలు ఉన్నాయి. కానీ యాపిల్ లోపల ఉండే విత్తనాల గురించి ప్రస్తావన వస్తే మాత్రం చాలా మంది భయపడతారు. దీనికి కారణం యాపిల్ విత్తనాలలో విషముంటుందని, వాటిని తింటే చచ్చిపోతారని. అసలు యాపిల్ విత్తనాలలో విషం ఉంటుందా? వైద్యులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..

యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే యాపిల్ పండ్లలో ఉండే విత్తనాలు(Apple seeds) ప్రాణానికి ప్రమాదం కలిగిస్తాయని చెబుతారు. యాపిల్ విత్తనాలలో సైనైడ్(cyanide) ఉంటుంది. సైనైడ్ అనేది విషం(poison). దీనికారణంగా ఈ విత్తనాలు పొరపాటున కడుపులోకి వెళితే చనిపోతారని అంటారు. అయితే యాపిల్ విత్తనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోమని వైద్యులు చెబుతున్నారు. సైనైడ్ ను సాధారణంగా యుద్ద రసాయనంగా ఉపయోగిస్తుంటారు. అనేక ఆహార పదార్థాలలో సైనోగ్లైకోసైడ్స్ అనే సైనైడ్లు ఉంటాయి. చాలా రకాల పండ్లలో కూడా సైనైడ్ ఉంటుంది. యూపిల్ గింజలలో సైనైడ్లలో ఒకటైన అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది.

Health Tips: కూరల్లో వాడే కరివేపాకును.. ఇలా కూడా వాడొచ్చా..? నీళ్లల్లో వాటిని బాగా మరిగించి రోజూ పొద్దున్నే తాగితే..!


యాపిల్ ను తిన్నప్పుడు ఎవరైనా పొరపాటున యాపిల్ విత్తనాలు తినేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాపిల్ విత్తనాల మీద పొర చాలా దృఢంగా ఉంటుంది. ఇది కడుపులోకి నేరుగా వెళితే జీర్ణం కాదు. మలవిసర్జనలో బయటకు వెళ్ళిపోతుంది. కానీ యాపిల్ విత్తనాలను ఎక్కువగా మింగడం లేదా కనీసం ఒక్క విత్తనాన్ని అయినా నమిలి తినడం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అమిగ్డాలిన్ జీర్ణక్రియలో చేరి ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది.

Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈ రెండింటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడంటే..!


Updated Date - 2023-10-10T10:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising