ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పిల్లలకోడి కోపాన్ని ఎప్పుడైనా చూశారా?? ఏకంగా డేగను ఎలా మూలన కూర్చోబెట్టిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-04-17T18:18:09+05:30

ఈ కోడి తన పిల్లలను ఎత్తుకెళ్ళడానికి వచ్చిన డేగను ఏకంగా వణికించేసింది. ఆ డేగ బిక్కుబిక్కుమంటూ మూలన తగలడింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాలలో పెరిగిన వారికి పిల్లల కోడి కోపం ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. కోడి తన పిల్లలతో ఆహారం కోసం తిరుగుతున్నప్పుడు డేగలు కోడిపిల్లలను కాళ్ళతో ఎత్తుకెళ్ళడం అనే మాట చాలా సార్లు వినే ఉంటాం. అయితే తన పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లికోడి ఎంతకైనా తెగిస్తుంది. అది చిన్న జంతువా.. పెద్ద జంతువా అని ముందూ వెనుకా కూడా ఆలోచించదు. అందుకేనేమో ఈ కోడి తన పిల్లలను ఎత్తుకెళ్ళడానికి వచ్చిన డేగను ఏకంగా వణికించేసింది. ఆ డేగ బిక్కుబిక్కుమంటూ మూలన తగలడింది. ఈ తల్లికోడి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోడి పైర్ చూసి అవాక్కవుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కోడి(Hen) తన పిల్లల(chickens)తో కలసి ఆహారం వేటలో ఉన్నప్పుడు ఆకాశంలో నుండి డేగలు వచ్చి పిల్లలను కాళ్లతో ఎత్తుకెళ్ళడం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఓ డేగ(eagle) ఆహారం కోసం ఆకాశంలో ఎగురుతూ వెళుతుండగా కోడి తన పిల్లలతో ఆహారం కోసం తిరుగుతూ కనిపించింది. ఇంకేముంది ఓ కోడిపిల్లను కాళ్లతో ఎత్తుకుని వెళితే కడుపు నింపుకోవచ్చని అనుకుంది. అనుకున్నదే తడవుగా పిల్లల ముందు వాలి కాళ్లతో పట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే తల్లి కోడి చాలా వేగంగా అప్రమత్తం అయింది. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారిలా మారిపోయింది. ఊహించనివిధంగా డేగ మీద విరుచుకుపడింది. కోడి తన రెక్కలు ఆర్పుతూ కోడి పందేల సమయంలో ఫైట్ చేసిన్టటు డేగమీద దాడి చేసింది. కోడి అంతలా రెచ్చిపోతుందని ఊహించని డేగకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. 'కోడిపిల్ల సంగతి దేవుడెరుగు నా ప్రాణాలు దక్కితే చాలురా భగవంతుడా..' అన్నంతగా భయపడిపోయింది డేగ. బిక్కుబిక్కుమంటూ రాళ్ళ సందుల్లోకి వెళ్ళి దాక్కుంది. 'నా పిల్లల జోలికొస్తే తాటతీస్తా' అనేలా ఎక్స్పెషన్ ఇచ్చి అక్కడినుండి పిల్లల దగ్గరకు కదిలింది కోడి.

Medicine: మీరూ ఇలానే మందులు వేసుకుంటున్నారా? జబ్బులు తగ్గడం మాట అటుంచితే ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..


ఈ వీడియోను The Figen అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. Never mess with a Mom! అనే క్యాప్షన్ దీనికి జోడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'జంతువుల్లో అయినా మనుషుల్లో అయినా అమ్మ ప్రేమ మాత్రం ఒకటే' అంటున్నారు. 'తన పిల్లల కోసం తల్లి ఎంతటివారితో అయినా యుద్దం చేస్తుంది' అని కామెంట్స్ చేస్తున్నారు. 'టచ్ చేస్తే తాట తీస్తా' అంటుందిగా ఈ తల్లి కోడి అని చమత్కరిస్తున్నారు.

Viral Video: ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. ఈ యువతికి వరుసగా మూడు సార్లు ముక్కు పగిలిపోయిందిగా.. అద్దాలున్నాయని తెలియక..!


Updated Date - 2023-04-17T18:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising