ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Photos: మీరు తరచుగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోండి..

ABN, First Publish Date - 2023-10-08T16:43:11+05:30

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉండడం అనివార్యంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండేవారు చాలా అరుదు. అలాగే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న వారు వీలైనంత తరచుగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుంటారు. ప్రతి సందర్భంలోనూ ఫొటో తీసుకోవడం అనేది ప్రస్తుతం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఉండడం అనివార్యంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండేవారు చాలా అరుదు. అలాగే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న వారు వీలైనంత తరచుగా ఫొటోలు (Photos), సెల్ఫీలు (Selfies) తీసుకుంటుంటారు. ప్రతి సందర్భంలోనూ ఫొటో తీసుకోవడం అనేది ప్రస్తుతం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ప్రతి సందర్భాన్ని ఫొటో రూపంలో భద్రపరచుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. ఇలా తరచుగా ఫొటోలు తీసుకునే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది (Photography on mental health).

తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, ఇతరులతో తమ భావాలను పంచుకోవడానికి ఫొటోగ్రఫీ అనేది వారధిగా మారింది. డిప్రెషన్, యాంగ్జయిటీ, ట్రామా వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఫొటోగ్రఫీ అలవాటు వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడుతున్నారట. వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై (Mental health) స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ అనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో భాగంగా 41 మందిని 4 వారాల పాటు పరిశీలించారు. రోజులో ఒక్కసారి మూడు రకాల ఫొటోలు తీసుకోవాలని సూచించారు.

Balloons: నోటితో నేరుగా బెలూన్లను ఊదేస్తున్నారా? ఇకపై ఆ పొరపాటు చేయకండి.. ఎందుకంటే..

ప్రతిరోజూ ఓ స్మైలింగ్ ఫొటో, తనను తాను సంతోషపెట్టే ఫొటో, ఇతరులను సంతోష పెట్టే ఫొటోలు తీసుకోవాలని సూచించారు. నాలుగు వారాల అనంతరం వారిని పరిశీలించగా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడినట్టు తేలింది. ఫొటోగ్రఫీ అనేది వ్యక్తుల్లో ఆశావహ దృక్పథాన్ని పెంచుతున్నట్టు కనుగొన్నారు. ఫోటోగ్రఫీ అనేది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అత్యంత జ్ఞానపరమైన చర్య అని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డెనిస్ సి. పార్క్ తెలిపారు. కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణులు ఫోటోగ్రఫీని చికిత్సగా కూడా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-08T16:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising