ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat: వందే భారత్ రైళ్లలో రాత్రిళ్లు ప్రయాణిస్తున్నారా..? ఈ రూల్స్‌ ముందే తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2023-08-19T15:54:40+05:30

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలనే ఇష్టపడుతుంటారు. వందేభారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాత్రిపూట ప్రయాణం చేసేటపుడు ప్రయాణికులు కొన్ని నిబంధనలను పాటించాలి.

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే (Indian Railways) ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలనే ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అతి వేగంగా ప్రయాణించే వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) చాలా చోట్ల అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాత్రిపూట ప్రయాణం (Night Journey) చేసేటపుడు ప్రయాణికులు (Passengers) కొన్ని నిబంధనలను పాటించాలి. ప్రయాణికులు ప్రశాంతమైన నిద్రను పొందేందుకు వీలుగా భారతీయ రైల్వే ఇటీవల రాత్రి ప్రయాణ నియమాలను (New Rules) అప్‌డేట్ చేసింది. వందే భారత్, రాజధాని సహా అన్ని రైళ్లలో ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఆ నియమాలు ఏంటి?

1) రాత్రిపూట ప్రయాణించేటప్పుడు, ఇతరుల నిద్రకు ఆటంకం కలిగించేలా లైట్లు వేయకూడదు.

2) రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు పెద్దగా మాట్లాడేందుకు వీలు లేదు.

3) రాత్రి 10 గంటల తర్వాత ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ కింద ఆహారం అందించరు.

4) రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణీకుల టిక్కెట్‌ను టీటీఈ తనిఖీ చేయకూడదు.

5) మీరు ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నట్టైతే 70 కిలోల కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లవచ్చు.

6) స్లీపర్ క్లాస్‌లో 40 కిలోల లగేజీ, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల లగేజీని అనుమతిస్తారు.

7)రాత్రి సమయంలో మిడిల్ బెర్త్ ప్యాసింజర్‌ తన బెర్త్ ఓపెన్ చేసుకోకుండా లోవర్ బెర్త్ ప్యాసింజర్ అడ్డుకోకూడదు.

Updated Date - 2023-08-19T15:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising