Geyser: చలికాలంలో వేడినీళ్ల కోసం గీజర్ వాడుతున్నారా? ఇలాంటి తప్పులు చెయ్యొద్దు.. ఓ యువతి చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే..
ABN, First Publish Date - 2023-11-05T17:38:54+05:30
చూస్తుండగానే చలి కాలం వచ్చేసింది. అప్పుడే చలి విజృంభించడం ప్రారంభమైంది. ఈ నెల చివరి నాటికి, దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన చలి మొదలవుతుంది. అంత చలిలో చన్నీళ్ల స్నానం చేయడమంటే మాటలతో పని కాదు. చాలా మంది వేడి నీళ్ల కోసం తాపత్రయపడుతుంటారు.
చూస్తుండగానే చలి కాలం (Winter) వచ్చేసింది. అప్పుడే చలి (Cold) విజృంభించడం ప్రారంభమైంది. ఈ నెల చివరి నాటికి, దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన చలి మొదలవుతుంది. అంత చలిలో చన్నీళ్ల స్నానం చేయడమంటే మాటలతో పని కాదు. చాలా మంది వేడి నీళ్ల (Hot Water) కోసం తాపత్రయపడుతుంటారు. కొందరు కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకుంటారు. కొందరు బాత్రూమ్‌ల్లో గీజర్ల (Geysers)పై ఆధారపడుతుంటారు. అయితే గీజర్లు వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ ప్రమాదాలు జరిగే వీలుంది.
తాజాగా ఓ యువతి సోషల్ మీడియాలో ఓ వీడియోను (Viral Video) షేర్ చేసింది. స్నానం చేయడానికి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పింది. తన ఇంట్లో జరిగిన గీజర్ ప్రమాదం గురించి వివరిస్తూ ఇతరులకు జాగ్రత్తలు (Precautions) చెప్పింది. ``మీరు స్నానం చేయడానికి వెళ్లే 5 నిమిషాల ముందు గీజర్ ఆన్ చేయండి. గీజర్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బాత్రూమ్‌కు వెళ్లండి. గీజర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం (Bathing) చేయవద్ద``ని సూచించింది.
Viral Video: ఇదెక్కడి ప్రయోగంరా బాబూ.. బిస్కెట్లతో పకోడీనా.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన ఏంటంటే..
బాత్రూమ్‌లోని గీజర్‌ను ఎక్కువ సేపు స్విచ్ఛాఫ్ చేసి ఉంచినందు వల్ల ఆమె ఇంట్లో గీజర్ పేలిపోయింది. ఆ సమయంలో బాత్రూమ్‌లో ఎవరైనా ఉంటే వారి ప్రాణాలకు ప్రమాదం తప్పదు. అందుకే గీజర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బాత్రూమ్‌కు వెళ్లాలని ఆ యువతి సూచిస్తోంది. ఆ యువతి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.
Updated Date - 2023-11-05T17:38:57+05:30 IST