కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Baby First Haircut: మొట్టమొదటిసారి హెయిర్ కటింగ్.. సెలూన్‌లో ఈ పిల్లాడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-08-22T12:29:39+05:30

పిల్లలు ప్రతి భావోద్వేగాన్ని దాచుకోకుండా బయటపెడతారు. కోపం, అలక, భయం, ఏడుపు, సంతోషం ఇవన్నీ వారిలో వెంటవెంటనే మారిపోతుంటాయి.

Baby First Haircut: మొట్టమొదటిసారి హెయిర్ కటింగ్.. సెలూన్‌లో ఈ పిల్లాడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి..!

పిల్లలు కల్మషం లేనివారు. వారి ప్రవర్తన ఎప్పుడూ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో, అల్లరితో అందరినీ సంతోషం పెడుతుంటారు. కొన్ని సందర్బాలలో పిల్లల రియాక్షన్స్ చూస్తే భలే ముద్దొస్తుంది. ఓ మహిళ తన కొడుకును మొదటిసారి హెయిర్ కట్ కోసం సెలూన్ కు తీసుకెళ్ళింది. బార్బర్ పిల్లాడి జుట్టు కత్తిరిస్తోంటే ఆ పిల్లాడు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి రియాక్షన్ కు ఫిదా అయిపోతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పిల్లలు ప్రతి భావోద్వేగాన్ని దాచుకోకుండా బయటపెడతారు. కోపం, అలక, భయం, ఏడుపు, సంతోషం ఇవన్నీ వారిలో వెంటవెంటనే మారిపోతుంటాయి. మరీ ముఖ్యంగా పిల్లలు హెయిర్ కట్ సమయంలో నానా గోల చేస్తారు. కొందరు ఏడిస్తే, మరికొందరు బార్బర్ ను దుర్భాషలాడటం, కొట్టడం చేస్తారు. ఇంకొందరు అక్కడి నుండి పారిపోవడానికి గింజుకుంటారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం తన మొదటి హెయిర్ కట్(baby first haircut) లో క్యూట్ ఎక్స్పెషన్స్(baby cute expression) ఇచ్చాడు. జుట్టు కత్తిరించడానికి బార్బర్ కత్తెర తీస్తోంటే ఎక్కడ లేని భయం పిల్లాడి కళ్ళలో కనిపించింది. ఆ తరువాత బార్బర్ పిల్లాడి జుట్టు కత్తిరిస్తోంటే తనకు హెయిర్ కట్ చెయ్యొద్దన్నట్టుగా భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఏడుపు ఆపుకుంటూ పెదవులు బిగబట్టి ముఖాన్ని విషాదంగా పెట్టాడు.

Smartphone Charging: స్మార్ట్‌ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే చాలు.. యమా స్పీడ్‌గా ఛార్జింగ్..!



ఈ వీడియోను zion_ez అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'పిల్లాడి మొదటి హెయిర్ కట్ లో అతని రియాక్షన్' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి రియాక్షన్ కు ఫిదా అవుతున్నారు. 'ఎంత అందంగా ఉన్నాడో' అని ఒకరు కామెంట్ చేశారు.'వీడియో ఇంత తక్కువగా తీశారేం. పిల్లాడి రియాక్షన్ ఇంకాసేపు రికార్డ్ చేయాల్సింది' అని మరొకరు వీడియో నిడివి గురించి కంప్లైంట్ చేశారు. 'అయ్యో ఎంత ముద్దుగా బాధపడుతున్నాడో' అని మరికొందరు అంటున్నారు.

Snake: పాములు పగబడతాయా..? పిల్లలను మింగి మళ్లీ బయటకు రప్పించగలవా..? అసలు నిజాలేంటంటే..!


Updated Date - 2023-08-22T12:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising