Digital Beggar: టెక్నాలజీ వాడుకుంటున్న బిచ్చగాడు.. చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన.. వీడియో వైరల్!
ABN, First Publish Date - 2023-07-04T10:50:52+05:30
మనం తరచుగా రైళ్లలో లేదా బయట ఎక్కడైనా బిచ్చగాళ్లను చూస్తూ ఉంటాం. వాళ్లు డబ్బులు అడిగితే కొందరు ఇస్తారు, మరికొందరు చిల్లర లేదని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా వరకు డిజిటల్ మనీ కాబట్టి చిల్లర లేదనే సాకు చాలా వరకు నిజం కూడా.
మనం తరచుగా రైళ్లలో లేదా బయట ఎక్కడైనా బిచ్చగాళ్లను (Beggars) చూస్తూ ఉంటాం. వాళ్లు డబ్బులు అడిగితే కొందరు ఇస్తారు, మరికొందరు చిల్లర లేదని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా వరకు డిజిటల్ మనీ (Digital Money) కాబట్టి చిల్లర లేదనే సాకు చాలా వరకు నిజం కూడా. అయితే ముంబై (Mumbai)కి చెందిన ఓ బిచ్చగాడి దగ్గర మాత్రం అలాంటి సాకు చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఆ బెగ్గర్ కూడా డిజిటల్ బాట పట్టాడు. @jaggirm అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోను ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train)లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రయాణికులతో రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ కోచ్‌లోకి ఒక భిక్షగాడు పాటలు పాడుకుంటూ ప్రవేశించాడు. అతడి చేతిలో ఓ క్యూర్ కోడ్ (QR Code) ఉంది. అక్కడ నిలబడి ఉన్న ప్రయాణికులు భిక్షగాడిని చూసి ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. కొందరు నవ్వుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.
Viral Video: ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం.. యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్!
రోడ్డు పక్కన క్యూఆర్ కోడ్‌లు పట్టుకుని బిచ్చగాళ్లు నిలబడిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``ఇక చిల్లర లేదని చెప్పడం కుదరదు``, ``డిజిటల్ బెగ్గర్`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-04T10:50:52+05:30 IST