ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: 14 ఏళ్ల తర్వాత బయటపడ్డ భార్య నిజ స్వరూపం.. బిత్తరపోయిన భర్త.. సినిమాని మించిన ట్విస్ట్!

ABN, First Publish Date - 2023-09-27T12:55:21+05:30

పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పారు పెద్దలు. తాజాగా బెంగాల్‌లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే.. పెద్దలు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అని అనిపించకమానదు.

Viral News: పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలన్నారు పెద్దలు. తాజాగా బెంగాల్‌లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే.. పెద్దలు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అని అనిపించకమానదు. ప్రస్తుతం ఈ ఘటన తాలూకు వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కోల్‌కతాకు (Kolkata) చెందిన ఓ వ్యాపారవేత్త ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అలా వారి వివాహా బంధం 14 ఏళ్లు సాఫీగా సాగిపోయింది. ఆమె కూడా భర్త వద్ద బాగానే మేనేజ్ చేసింది. కానీ, ఇటీవల ఆమెకు సంబంధించి ఓ షాకింగ్ విషయం మనోడికి దిమ్మతిరిగేలా చేసింది. అసలు సంగతి తెలిసి బిత్తరపోవడం అతడి వంతైంది. సినిమాని మించిన ట్విస్ట్ ఉన్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్ రాజధాని కోల్‌కతా వాసి తబీష్ ఎహ్సాన్ (Tabish Ehsan) 2009లో నాజియా అంబ్రీన్ ఖురైషీని (Nazia Ambreen Quraishi) పెళ్లి చేసుకున్నాడు. వివాహం సమయంలో నాజియా తనను తాను ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) నివాసిగా పరిచయం చేసుకుంది.

అలా తబీష్, నాజియా దాంపత్య జీవితం 14 ఏళ్లు సాఫీగానే గడిచింది. ఇన్నేళ్లలో వారి మధ్య మనస్పర్థలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే, ఇటీవల నాజియా గురించి తబీష్‌కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆమె అసలు భారతీయురాలే కాదని తెలిసి మనోడు నిర్ఘాంతపోయాడు. నాజియా బంగ్లాదేశీ (Bangladeshi) అని తాజాగా తబీష్‌కు తెలిసింది. భారత పౌరసత్వం (Indian Citizenship) పొందేందుకు ఆమె తనను ఉపయోగించుకుందని తబీష్ చెప్పాడు. తనను మోసపూరితంగా పెళ్లాడిందని వాపోయాడు. అంతేగాక నాజియాకు ఇంతకుముందే వివాహమైందట. తనను పెళ్లి చేసుకోకముందే బంగ్లాదేశ్‌లోని ఓ స్కూల్ టీచర్‌ని పెళ్లి చేసుకున్నట్లు తబీష్‌కు తెలిసింది. ఆమె మొదటి భర్త నుంచి బలవంతంగా విడాకులు తీసుకుందని ఆరోపించాడు. తప్పుడు ఆరోపణలతో తన మొదటి భర్తను నాజియా అనేక ఇబ్బందులకు గురిచేసి విడాకులు పొందినట్లు చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత నాజియా, ఆమె కుటుంబం ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా భారత్‌కు తరలివచ్చారు. నాజియాతో తన వివాహం భారత పౌరసత్వం (Indian Citizenship) పొందడం కోసం ఆమె చేసిన కుట్రలో ఒక భాగం మాత్రమేనని తబీష్ తెలిపాడు. వెంటనే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆమెపై ఐసీపీ సెక్షన్ 120బీ, 465, 467, 471, 363, ఫారినర్ యాక్ట్ సెక్షన్ 14 ఎ(బి), పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 17 కింద కేసులు నమోదు చేశారు. అలాగే నాజియా పాస్‌పోర్ట్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.

Viral Video: నడిరోడ్డుపై వజ్రాల కోసం జనం వెతుకులాట.. చివరికి ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందంతే..!

Updated Date - 2023-09-27T13:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising