ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ర్యాపిడో బుక్ చేస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద వచ్చిన రైడర్.. అతడెవరో తెలుసుకుని షాకైన టెకీ!

ABN, First Publish Date - 2023-08-12T10:49:58+05:30

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. అతడు ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేశాడు. కొంతసేపటికి రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై రైడర్ వచ్చాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిపై రైడ్‌కు వెళ్తున్నందుకు ఆ టెకీ సంతోషించాడు. అయితే అతడి సంతోషం ఎంతో సేపు నిలవలేదు.

బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ (Software Engineer)కు ఓ వింత అనుభవం ఎదురైంది. అతడు ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు ర్యాపిడో (Rapido) బుక్ చేశాడు. కొంతసేపటికి రాయల్‌ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్‌పై రైడర్ వచ్చాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిపై రైడ్‌కు వెళ్తున్నందుకు ఆ టెకీ సంతోషించాడు. అయితే అతడి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆ రైడర్ గురించిన సమాచారం తెలుసుకుని ఆ టెకీ షాకయ్యాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

బెంగళూరులో కుబెర్నెట్ మీటప్ అనే స్టార్టప్‌లో పని చేస్తున్న నితిష్ పటేల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ర్యాపిడో బుక్ చేశాడు. కొద్ది సేపటికి అతడి దగ్గరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై రైడర్ వచ్చాడు. . రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిపై రైడ్‌కు వెళ్తున్నందుకు నితీష్ సంతోషించాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో రైడర్ గురించి ఆరా తీశాడు. ఆ రైడర్ హై ఎండ్ టెక్నాలజీని రూపొందించే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తెలిసి నితీష్ షాకయ్యాడు. అంతేకాదు తన సంస్థ కుబెర్నెట్ మీటప్ క్లస్టర్ బాధ్యతలు నిర్వహించే సంస్థలోనే పని చేస్తున్నాడని తెలిసి ఖంగుతిన్నాడు (Viral News).

MS Dhoni: రాంచీ ఎలా వెళ్లాలి? హఠాత్తుగా ధోనీని చూసి షాకైన అభిమానులు.. మహీ సింప్లిసిటీకి ఫిదా!

తనకు ఎదురైన అనుభవాన్ని నితీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌కు 9 వేలకు పైగా వ్యూస్ దక్కాయి (Viral Tweet). చాలా మంది ఆ పోస్ట్‌పై కామెంట్లు చేశారు. ``ఇంతకీ ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైడ్ ఇన్‌కమ్ ఎంతో అడిగారా?`` అని ఒకరు ప్రశ్నించారు. దానికి నితీష్ స్పందిస్తూ.. ``అవును.. ర్యాపిడో ద్వారా ఎంత సంపాదిస్తున్నారు అని అడగాల్సింది`` అని రిప్లై ఇచ్చాడు. ``ఉన్నత చదువులు చదువుకున్న ఎంతో మంది ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి నడుపుతున్నార``ని మరొకరు కామెంట్ చేశారు.

Updated Date - 2023-08-12T10:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising