Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ జామ్.. ప్రేమ పక్షులకు వరం.. మహిళ చేసిన ఫన్నీ ట్వీట్‌పై భారీగా స్పందిస్తున్న నెటిజన్లు!
ABN, First Publish Date - 2023-10-09T15:10:31+05:30
భారత ఐటీ సిటీ, సిలికాన్ వ్యాలీ బెంగళూరు పేరు చెప్పగానే ఐటీ రంగం మాత్రమే కాదు.. ఎడతెగని ట్రాఫిక్ కూడా గుర్తుకు వస్తుంది. బెంగుళూరు నగరం సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల బెంగళూరు నగరం అవుటర్ రింగ్ రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఎంతో మందికి అసహనం కలిగించింది.
భారత ఐటీ సిటీ, సిలికాన్ వ్యాలీ బెంగళూరు (Bengaluru) పేరు చెప్పగానే ఐటీ రంగం మాత్రమే కాదు.. ఎడతెగని ట్రాఫిక్ (Traffic jam) కూడా గుర్తుకు వస్తుంది. బెంగుళూరు నగరం సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల బెంగళూరు నగరం అవుటర్ రింగ్ (ORR) రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఎంతో మందికి అసహనం కలిగించింది. ఈ ట్రాఫిక్ జామ్‌పై (Bengaluru traffic jam) ఓ మహిళ చేసిన ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ట్రాఫిక్‌లో వేచి ఉండే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెబుతూ ఆ మహిళ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Tweet) అవుతోంది.
``బెంగళూరు డేటింగ్ చిట్కా (Bangalore dating tip): రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో మీకు ప్రియమైన వారిని కలుసుకోండి. ఇష్టమైన ప్రదేశానికి కలిసి ప్రయాణించడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీరు కలిసి ఎక్కువ సమయం గడపగలుగుతారు. అలాగే వారికి కోపం, అసహనం వంటివి ఎక్కువగా ఉన్నాయో లేదో కూడా మీరు తెలుసుకోగలుగుతారు`` అని ప్రకృతి అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. బెంగళూరు ట్రాఫిక్ జామ్ మీద ఆమె వేసిన సెటైర్ బాగా పేలింది. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు దాదాపు 1.5 లక్షల మంది వీక్షించారు.
Wife: పిల్లలతో కలిసి నిద్రపోతున్న భర్త.. తలగడ తీసుకొచ్చిన తల్లి, ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
ఈ ట్వీట్‌పై చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``అవును.. బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అనేది ఓ లిట్మస్ టెస్ట్``, ``ఇది నిజంగా గొప్ప సలహా``, ``బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కుని కూడా కామ్‌గా ఉండే వ్యక్తి చాలా గొప్పవాడు``, ``మన సహనాన్ని పరీక్షించుకోవడానికి అది మంచి వేదిక`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-09T15:10:31+05:30 IST