ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Best School: ఈ స్కూల్‌లో పిల్లలు డబ్బులు కట్టనక్కర్లేదు.. ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఫీజుగా తీసుకుంటారట..!

ABN, First Publish Date - 2023-09-15T10:11:04+05:30

మెరుగైన విద్య అందించే పాఠశాలలు చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి. కానీ ఆ పాఠశాలలో మాత్రం డబ్బులు కట్టక్కర్లేదు. దానికి బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లు స్కూల్లో డిపాజిట్ చేయాలి.

చదువు 'కొంటున్న' కాలమిది. పిల్లలకు మంచి విద్య అందించాలంటే మంచి స్కూళ్ళలో వేలాది రూపాయలు కట్టాలి. స్కూలు ఫీజు కట్టే సమయం వచ్చిందంటే చాలు తల్లిదండ్రుల అవస్థ మాటల్లో చెప్పలేనిది. సాధారణంగా ప్రభుత్వ సంస్థలలో మాత్రమే ఉచిత విద్య ఉంటుంది. మెరుగైన విద్య అందించే పాఠశాలలు చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి. కానీ ఆ పాఠశాలలో మాత్రం డబ్బులు కట్టక్కర్లేదు. దానికి బదులుగా ఒక్కొక్క పిల్లవాడి నుండి 100ప్లాస్టిక్ బాటిళ్లు ఫీజుగా తీసుకుంటారు. ఈ వింత పాఠశాల విదేశాల్లో ఉందని అనుకుంటే పొరపాటే. ఇది అచ్చంగా మన భారతదేశంలోనిదే. కేవలం ప్లాస్టిక్ బాటిళ్ళను ఫీజుగా కట్టడమే కాదు. ఈ పాఠశాలకు సంబంధించి బోలెడు విశేషాలున్నాయి. అసలు ఈ పాఠశాల ఎక్కడుంది? దీన్ని నడుపుతున్నది ఎవరు? పూర్తీగా తెలుసుకుంటే..

భారతదేశంలో అత్యంత పేదరికం కలిగిన రాష్ట్రం అస్సాం(Assam). ఈ రాష్ట్రం దేశంలోని వివిధ కార్యకలాపాలకు దూరంగా ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ది తక్కువగా ఉంది. పైపెచ్చు అస్సాంలో 80శాతం పైగా వ్యవసాయమే నడుస్తోంది. అక్షరాస్యత, ఉద్యోగాలు చేసేవారు చాలా తక్కువ. 2013లో మజిన్ మక్తార్ అనే వ్యక్తి ఒక పాఠశాల ప్రాజెక్ట్ మీద న్యూయార్క్ నుండి భారతదేశానికి వచ్చారు. టాటా ఇన్స్టిట్యూట్ లో సోషల్ సర్వీస్ లో మాస్టర్ డిగ్రీ చేస్తున్న పర్మితను మజిన్ కలిశారు. వీరిద్దరికీ విద్యారంగంలో పనిచేయాలని ఆసక్తి ఉండేది. అదే వారిద్దరినీ ఒక్కటిగా నడిపింది. వీరిద్దరి ఆలోచన నుండి రూపుదిద్దుకున్నదే అక్షర్. అక్షర్(Akshar) ను 2016లో అస్సాం రాష్ట్రం గౌహతిలో స్ఠాపించారు. అటవీ ప్రాంతంలో అపరిశుభ్రత, నిరక్షరాస్యతను తొలగించి వారిని విద్యావంతులను చేసే ఉద్దేశంతో వీరి ప్రయత్నం సాగింది. ప్రతిరోజూ ఉదయాన్నే పిల్లలు పుస్తకాల బ్యాగులతో పాటు తమ చేతులలో ప్లాస్టిక్ బాటిళ్ళున్న సంచిని కూడా తీసుకెళ్తారు. ఒక్కొక్క విద్యార్థి ప్రతి వారం 25ప్లాస్టిక్ బాటిళ్లను స్కూళ్ళో డిపాజిట్ చేస్తారు(plasctic bottle deposit in school instead of money). ఇవి కేవలం ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు కాదు. వీటిలో ప్లాస్టిక్ కవర్లు కూడా నింపుతారు. వీటన్నింటిని రిసైక్ చేస్తారట.

100 Years Life: ఈ 5 రకాల ఆహార పదార్థాలను తినండి చాలు.. 100 ఏళ్ల లైఫ్‌కు అవే గ్యారెంటీ..!



కేవలం ప్లాస్టిక్ మీద మాత్రమే వీరు పోరాటం చేయడం లేదు. వడ్రంగి పని, తోటపని, వివిధ కళలు మొదలైనవి కూడా వీరి విద్యలో భాగం చేశారు. పర్యావరణ ఇటుకలను కూడా తయారుచేస్తున్నారు. వీటిని పాఠశాలలోనే మంచి నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం ఏమిటంటే ఈ పాఠశాలలో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు లేరు. పెద్ద తరగతి పిల్లలు చిన్నతరగతి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. వీరందరూ కలసి పనిచేస్తారు, కలసి నేర్చుకుంటారు. ఈ ప్రణాళిక ఫలితంగా అంత మారుమూల ప్రాంతంలో ఇన్నేళ్ళలో ఒక్క పిల్లవాడు కూడా బడి మానడం జరగలేదు. అస్సాం అంటే పేదరికం కాదు.. అక్షర్ లాంటి అద్భుతం కూడా అక్కడుందని దీని గురించి తెలిసిన పలువురు ప్రశంసిస్తున్నారు.

అస్సాంలోని అక్షర్ కు సంబంధించి ఒక షార్ట్ వీడియోను ontheground.with.sai అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'పాఠశాల అంటే ఇలాగే ఉండాలి. పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి లేనప్పుడే వారు బాగా నేర్చుకోగలుగుతారు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ జంట చాలా గొప్ప పనిచేసింది. వారిద్దరికీ హ్యాట్సాఫ్' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఈ వీడియో చేసిన వ్యక్తికి థ్యాంక్స్. అతను చాలామంచి విషయాన్ని పరిచయం చేశాడు' అని ఇంకొకరు అన్నారు.

Health Facts: ఈ 8 అలవాట్లలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే మానేయండి.. లేదంటే కాలేయం దెబ్బతినడం ఖాయం..!


Updated Date - 2023-09-15T10:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising